“కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంపై అన్ని విధాలా చిన్నచూపే చూస్తోంది. అది ఎంతమాత్రం సమంజసం కాదని తెలంగాణ నిద్రిస్తున్న ఢిల్లీ పాదుషాలకు తెలియచెప్పాలి. తెలంగాణ అభివృద్ధికీ, ఈ పంచవర్ష ప్రణాళికలకూ అంతగా పొత్తుకుదరదు. దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలతో సమానంగా ఈ ప్రదేశం అభివృద్ధి గాంచాలంటే రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలి. మామూలు పంచవర్ష ప్రణాళికలే కాక ప్రత్యేకం “మాస్టర్ ప్లాన్” కూడ తయారు చేయించాలి.”
44 జనధర్మో విజయతే
పోచంపాడు ప్రొజెక్టును భారీ ప్రాజెక్టుగానే ప్రారంభించాలి, నిర్మించాలి అని జనధర్మ రచయిత చైతన్య వాదించారు. మొదట అనుకున్న విధంగా కాక చిన్న రకం ప్రాజెక్టుగా కుదించేయటం ఏమి న్యాయం? మధ్య రకం నిర్మించ నెంచటం వల్ల తెలంగాణ ప్రజల కష్టాలు అంతరిస్తాయా? భాక్రానంగల్, హీరాకుడ్, కోయనాలాంటి ప్రాజెక్టులను మొదట అనుకున్న విధంగా కాక మధ్యలో మార్చి చిన్న తరహాలో నిర్మించియుంటే ఆప్రాంత ప్రజలు ఊరుకుంటారా?
పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం కుంటి నడకతో సాగటంతో బాటు ఈమధ్య, అంతర్ రాష్ట్రీయనదీజలాల వివాదం అన్న విషయం దుమారంవలె వ్యాపించింది. ఈ వివాదానికి ముఖ్య కారణం మైనూరు, మహారాష్ట్రాల అవకాశవాదం తప్ప మరేమీ కాదు. రాష్ట్రంలోని ప్రజలందరు ఈ విషయంలో పార్టీ పార్టీతత్వాలు, ముఠా తత్వాలు విస్మరించి ఏకకంఠంతో వ్యవహరించటం సముచితం.
నిద్రించిన తెలంగాణ మేల్కోవాలి
నిద్రిస్తున్న తెలంగాణ ప్రజాశక్తి మేల్కోవాల్సిన సమాయమాసన్నమైనది, ఏవిధంగానైన పోచంపాడును భారీ ప్రాజెక్టుగానే నిర్మించాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. (10,000 కోట్ల రూపాయిలపై చిలుకు పెట్టుబడివున్న తృతీయ ప్రణాళికలో ప్రజలకు ప్రాణం వంటి దైన 117 కోట్ల రూపాయిల ప్రాజెక్టుకు స్థానంలేదా? ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్వహించలేకపోతే కేంద్ర ప్రభుత్వమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్వహించాలి, అసలుకు. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంపై అన్ని విధాలా చిన్నచూపే చూస్తోంది. అది ఎంతమాత్రం సమంజసం కాదని తెలంగాణ నిద్రిస్తున్న ఢిల్లీ పాదుషాలకు తెలియచెప్పాలి. తెలంగాణ అభివృద్ధికీ, ఈ పంచవర్ష ప్రణాళికలకూ అంతగా పొత్తుకుదరదు. దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలతో సమానంగా ఈ ప్రదేశం అభివృద్ధి గాంచాలంటే రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలి.
మామూలు పంచవర్ష ప్రణాళికలే కాక ప్రత్యేకం “మాస్టర్ ప్లాన్” కూడ తయారు చేయించాలి. 15 లేక 20 సంవత్సరాల ఈ మాస్టర్ ప్లాన్ గడువు కలిగి ఉండాలి. అంటే మాస్టర్ ప్లాన్ పూర్తి అయ్యే నాటికి, 1975 లేక 1980 సంవత్సరం నాటికి తెలంగాణ పటమే పూర్తిగా మార్పు చెందాలి. ప్రజాజీవితంలో నరనరాల్లో పాతుక పోయిన నిరక్షరాస్యత, బీదరికాలను కూకటి వేళ్ళతో మాస్టర్ ను పెకిలించి వేయాలి. పారిశ్రామికంగా. ఆర్థికంగా విద్యావిషయకంగా ఇంకా అన్న విధాల తెలంగాణం బాగుపడేందుకు ఈ ప్రణాళిక ఈ (మాస్టర్ ప్లాను) దోహద కారి కావాలి. దేశంలో (బహుళ ప్రపంచం మొత్తం పైన నేమో ఈ విధంగ కొత్త పద్ధతిని, వెనక పడిన ప్రాంతాల అభివృద్ధికి కావలసిన, ‘మాస్టర్ ప్లాను’ అమలుపరిచి, అభ్యుదయ పథంలో భారతదేశం మరొక్క అడుగు ముందంజ వేసిందని ఈ విషయాన్ని నిర్వహించటం ద్వారా నిరూపించాలి. ఆర్థిక శాస్త్రవేత్తలు, దేశంలోని విజ్ఞులు ఈ విషయాన్ని పరిశీలించాలి.
ఇక ప్రస్తుత పరిస్థితులు
ఇంతవరకు సంభవించిన సంఘటనలను బట్టిచూస్తే ఆంధ్రప్రాంతీయులు తెలంగాణా అవసరాలపై సహనం చూపలేక పోయారని విశదమవుతుంది.
వీనికి మచ్చుతునకలు.
వరంగల్లు రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకించిన 135 సీట్లు తెలంగాణాకు కేటాయించాలనే ప్రాంతీయకమిటీ తీర్మానానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం విలువ నివ్వకపోవుటం. ఆంధ్రప్రాంతాల్లో చిన్న చిన్న పట్టణాలకు కూడ డ్రైనేజీ పథకా న్ని అమలు పరుస్తూ కూడ తెలంగాణాలో ఏ ఇతర పట్టణానికి కూడ అట్టి పౌర సౌకర్యాన్ని కలిగించాలనే తలంపు ప్రభుత్వానికి కలుగక పోవటం. ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రాంతీయులకు సరిఐన న్యాయం కలుగచేయక పోవటం, ఉద్యోగుల జీతాల స్కేళ్ళలో తెలంగాణ వాసులకు లాభం కలుగచేయక పోవటం.
ఇవి కొన్ని మాత్రమే
తెలంగాణ ప్రజలలో క్రమ క్రమంగా అసంతృప్తి ప్రబలుతున్నట్లు కన్పడుచున్నది. ఇది సత్ఫలితాలకు మాత్రం దారితీయదు. తెలంగాణం అంటే అగ్నిపర్వతం వంటిదని దేశంలోని నాయకులందరికీ తెలిసిదే! స్థానిక ప్రజల్లో ఈ విధమైన వాదం బలపడకముందే, ఆంధ్ర సోదరులు, ఇతర నాయకులు గుర్తించి (కొన్నాళ్ళపాటు స్వలాభాన్ని మానుకునైనాసరే.) తదనుగుణంగ వ్యవహరించాలి. పరిస్థితులు చేయి దాటిపోయాక ఏమి చేసినా ‘ప్రయోజనం’ ఉండదు. ఈ ప్రాంతీయుల ఆశయసిద్ధికి అందరూ చేయూతనిచ్చి సహాయ పడతారని ఆశిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం దృక్పదంలో ఏలాంటిమార్పు రానున్నదో వేచిచూడాల్సిందే.
(1961లో జనధర్మ పత్రిక యం యస్ ఆచార్య పూర్తిపేరు మాడభూషణం శ్రీనివాసాచార్య. ఆంధ్రప్రింటింగ్ వర్క్స్ (పవర్ ప్రెస్) ముఖరం జాహీ రోడ్ వరంగల్ (తరువాత జయప్రకాశ్ నారాయణ్ రోడ్ అని పేరు మార్చారు) ముద్రించేది. సహాయకులుగా ఎం రాజేశ్వర శర్మ గారు, డి హనుమంతరావ్ గుప్త పనిచేసేవారు. అప్పుడు డాక్టర్ టి వై నరసింహాచార్య పత్రిక ఎడిటర్ గా ఉండేవారు.)





