పుస్తకం ఓ నేస్తం
పుస్తకం ఓ అక్షర క్షేత్రం
పుస్తకం తెరిచినంత మాత్రం
పదాల పసందైన పంట
పెదవులు చప్పరించే తీపి వంట !
పుస్తకంలోని అక్షరాలు పాత్రలై
ప్రాణం పోసుకుని సజీవములై
నీతో మాట్లాడుతాయి
అట్లా మాట్లాడుకుంటూ పోతే
అబ్బో! అది మరో ప్రపంచమే!
పుస్తకం విశ్వరూప దర్శనమే
పఠించే వారంతా పార్థులే!
పుస్తకం పేజీలు తిరగేస్తుంటే
భూత భవిష్యత్ వర్తమానాలు
కన్నుల ముందు కదిలిపోతున్నట్లే!
పుస్తకం వామనుని లెక్క
చిన్నదిగా అగుపించవచ్చు!
వామనుడు మూడడుగులేసినట్లు
ఇంతింతై తానంతై
సమస్తాన్ని యిముడ్చుకున్న
పుస్తకం సమస్త దర్శనం!
(హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్భంగా)
– పి.బక్కారెడ్డి, 9705315250





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల