తెలంగాణ సమస్య ‘పరిష్కారానికి’ ఇందిరాగాంధీ రూపొందించిన అష్టసూత్ర పధకం

“పార్లమెంట్ లో ప్రకటించారు కనుక ఈ ఇది అమలు చేసే పథకం అన్నారు. మళ్లీ తెలంగాణ జనం నమ్మింది. అందులో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దానికి సాక్షి – పార్లమెంట్, పెద్దమనుషుల ఒప్పందపు సంతకాలు. పెద్దమనుషుల ఒప్పందం అంటే కోర్టుకు లో పరిష్కారం అడగకుండా, రాజకీయంగా, రెండు ప్రాంతాలలో సమ అభివృద్ధి సాధిస్తారనే పెద్ద మనుషుల ఒప్పందం. దాని పేరు పథకం. అష్టసూత్రాల పథకం. చివరకు అది వారి ఇష్టసూత్రంఅనీ పనికిరాని కుట్ర పథకం అని చరిత్ర రుజువుచేస్తూ చేస్తూనే ఉంది. ఇప్పడికీ తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా రెండు పార్టీ ముఖ్యమంత్రులు పైకి చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. నమ్మడానికి వీల్లేదు. ఏది అబద్ధమో అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నమ్మడానికి వీల్లేని, పిచ్చిగా నమ్మిన తెలంగాణ నమ్మబడిన అష్టసూత్ర పథకం ఇది..”

తెలంగాణ కోసం తపన పడిన వారు: డాక్టర్ చెన్నారెడ్డి, నూకల రామచంద్రారెడ్డి, వి బి. రాజు, శ్రీ చొక్కారావు

తమకు గత 12 ఏళ్లుగా చేయబడిన అన్యాయాలకు గాను ప్రజలు తెలంగాణలో జరుగుతున్నఆందోళన గూర్చి పరిష్కారాన్ని కనుగొనటం కోసం ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏప్రిల్ మొదటి వారాంతానికి అనేకులు కలిసి చర్చలు జరిపించారు.  తెలంగాణ నాయకులయిన డాక్టర్ చెన్నారెడ్డి, నూకల రామచంద్రారెడ్డి, వి బి. రాజు,  శ్రీ చొక్కారావు ప్రధానమంత్రితో కూడా చర్చించారు. ఏప్రిల్ 10, 11 తేదీలలో యితర పార్టీల నాయకులతో కూడా సమాలోచించిన మీదట తెలంగాణ సమస్య పరిష్కారం కోసం ఎనిమిది అంశాలతో ఒక కార్యక్రమాన్ని రూపొందించి దానిని ఏప్రిల్ 11న సాయంత్రం పార్లమెంటులో ప్రకటించారు. ఈ ప్రాంత పథకం దిగువ ప్రచురిస్తున్నాము. అని జనధర్మ ప్రత్యేక సంచిక లో సంపాదకుడు అన్నారు. పార్లమెంట్ లో ప్రకటించారు కనుక ఈ ఇది అమలు చేసే పథకం అన్నారు.

మళ్లీ తెలంగాణ జనం నమ్మింది. అందులో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దానికి సాక్షి – పార్లమెంట్, పెద్దమనుషుల ఒప్పందపు సంతకాలు. పెద్దమనుషుల ఒప్పందం అంటే కోర్టుకు లో పరిష్కారం అడగకుండా, రాజకీయంగా, రెండు ప్రాంతాలలో సమ అభివృద్ధి సాధిస్తారనే పెద్ద మనుషుల ఒప్పందం. దాని పేరు పథకం. అష్టసూత్రాల పథకం. చివరకు అది వారి ఇష్టసూత్రంఅనీ పనికిరాని కుట్ర పథకం అని చరిత్ర రుజువుచేస్తూ చేస్తూనే ఉంది. ఇప్పడికీ తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా రెండు పార్టీ ముఖ్యమంత్రులు పైకి చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. నమ్మడానికి వీల్లేదు. ఏది అబద్ధమో అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నమ్మడానికి వీల్లేని, పిచ్చిగా నమ్మిన తెలంగాణ నమ్మబడిన అష్టసూత్ర పథకం ఇది.

(1) రిటైరయిన లేక ఇప్పుడు పదవిలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు క్షుణంగా తెలిసిన ఇక ఆర్థిక నిపుణుడూ కంప్ట్రోలర్ ఆడిటరు జనరల్ కార్యాలయం నుంచి ఒక సీనియర్ ప్రతినిధి సభ్యులను ఉన్నతాధికార సంఘం నియమింప బడుతారు. తెలంగాణ నిధులకు సంబంధించిన భిన్న భిన్నంగా ఉన్న అంచనాలను, అభ్యర్థనలను పరిశీలించి తెలంగాణ ప్రాంతాపు అభివృద్ధి పై ఖర్చు చేయవలసి ఉండిన మిగులు నిధులను ఈ సంఘం నిర్ధారించింది. మే నెలాఖరులోగా ఈ సంఘం తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తున్నది.

(2) మిగులు నిధుల మొత్తం మేరకు ఎలా ధనాన్ని సేకరించాలన్న విషయం నిర్ణయించడానికై కేంద్ర ఆర్థిక, హోమ్ మంత్రిత్వశాఖల ప్రతినిధులు. ప్రణాళికా సంఘం ప్రతినిధులు, ప్రభుత్వం ప్రతినిధులు వెంటనే పనులు ప్రారంభించారు.

(3) ముఖ్యమంత్రి సూచన్నపై తెలంగాణా అభివృద్ధికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని వెంటనే ఏర్పరచాలని అంగీకరించడం జరిగింది. ఈ ఉప సంఘానికి ముఖ్యమంత్రి ప్రణాళిక రాష్ట్రమంత్రి వర్గంలోని తెలంగాణా మంత్రులూ తెలంగాణా ప్రాంతీయ సంఘం అధ్యక్షుడూ ఇందులో సభ్యులుగా వ్యవహరిస్తారు.

పంచవర్ష ప్రణాళికల్లో తెలంగాణా ప్రాంతంలో అమలు జరుపవలసిన పథకాలనూ, కార్యక్రమాలనూ, సాధించవలసిన భౌతిక ఆర్థిక లక్ష్యాలనూ నిర్దేశించడం ఈ సంఘం ప్రధాన విధుల్లో ఒకటి. ఈ పథకాలూ. కార్యక్రమాలూ సరిగా అమలు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా ఈ సంఘం పరీక్ష చేస్తుంది. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి అవసరమైన సలహాలను కూడా ఉప సంఘం అందిచేస్తుంది.

4) ప్రణాళికా కార్యక్రమాలు పథకాలు అమలు జరుగుతున్న తీరును విపులంగా సమీక్ష చేయడానికి ఒక ప్రణాళికల అమలు సంఘం కూడా నియమింపబడుతుంది. యీ సంఘానికి ప్రణాళికా సంఘం ప్రతినిధి ఒకరు అధ్యక్షులుగా వుంటారు. కేంద్ర ఆర్థిక హోమ్ శాఖల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా యీ సంఘంలో ఉంటారు.

ఈ సంఘం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రికి నివేదికలు సమర్పిస్తుంది.

5) ఈ నిర్ణయాలను సత్వరం శక్తివంతంగా అమలు జరపడానికీ వాటి సమన్వయానికి తెలంగాణ ప్రాంతం సమస్యల బాధ్యత కలిగిన ప్రత్యేక అధికారులకు ఇంకా ఎక్కువ అధికారాలను ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.

6) తెలంగాణ ప్రాంతానికి చట్టబద్ధమైన తగు హామీలు ఇచ్చే అవకాశాన్ని గురించి భారత ప్రభుత్వం న్యాయశాస్త్రవేత్తల బృందంతో కలిసి పరిశీలిస్తుంది.

7) తెలంగాణాలో ప్రభుత్వోద్యోగుల విషయంలో వున్న కష్టనిష్ఠూరాల పరిశీలకు 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం క్రింది కేంద్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ అధ్యక్షతన నియమించబడిన కేంద్ర సలహా సంఘం (ఇందులో ఒక రిటైరయిన హైకోర్టు న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వం నుండి రిటైరయిన ఒక న్యాయశాఖా కార్యదర్శి సభ్యులుగా వుంటారు) త్వరలో హైదరాబాదు వెళ్లి కేంద్ర మంత్రికితి తగు సిఫార్సులు చేయగలదు. ఈ సూచనలను ముఖ్యమంత్రి చేశారు.

సర్వీసులకు సంబంధించి తేలకుండా మిగిలిపోయిన కేసుల పరిష్కారానికి నిర్ణీత వ్యవధిలోగా హోంశాఖ ఒక అత్యవసర కార్యక్రమాన్ని నిర్ణయిస్తుంది.

కేంద్ర సలహా సంఘం కాని రాష్ట్ర సలహా సంఘం కాని ఇచ్చే సలహాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం గైకొనే నిర్ణమాలను రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే అమలు జరుపుతుందని ముఖ్యమంత్రి కేంద్రానికి హామీ ఇచ్చారు.

(8) తెలంగాణా సమస్యలపట్ల కేంద్ర ప్రభుత్వం ఇక ముందు ఎప్పుడూ శ్రద్ధవహించేందుకు గాను ఆగు నెలలకొకసారి ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రితోను, తెలంగాణా అభివృద్ధికేర్పడిన వున్నతాధికార సంఘంలోని తదితరులతోను సమావేశమయి పరిస్థితిని సమీక్షిస్తారు. యీ సూచనను కూడా ముఖ్యమంత్రి చేశారు. యీ సమావేశాలకు వుపప్రధాని, కేంద్ర హోంమంత్రి యిందుకు సంబంధించిన యితర కేంద్ర మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కూడా హాజరవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *