ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ ఫలితాలు కావు..

“ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తేడా 5 శాతం గా ఇచ్చాయి.. అదే సమయంలో బీజేపీ వోట్ షేర్ 14 శాతం నుంచి 6 నుంచి 8 శాతం తగ్గినట్లు ఇచ్చాయి.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ  వోట్ షేర్ సగానికి పైగా ఏటు పోయింది అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్..ఏక పక్షంగా కాంగ్రెస్ కు పడిందా..బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్య చీలిపోయిందా అన్నది గెలుపోటములను డిసైడ్ చేస్తుంది.”

తెలంగాణలో రెండు మూడు నెలల రాజకీయ ఉత్కంఠకు నవంబర్ 11న జరిగిన పోలింగ్ తో కాస్తా తెర పడింది.. ..చెదురుమదురు ఘటనలతో జూబ్లీహిల్స్ బై పోల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నట్లు కనిపిస్తుంది.. సహజంగానే బీజేపీ మొదటి నుండి నామమాత్రంగా పోటీలో ఉంది.. ఎక్కడ కమలం నేతలు సీరియస్ గా తీసుకోలేదు.. ప్రచారం నుంచి చివరి రెండు రోజుల పోల్ మేనేజ్మెంట్ లో బీజేపీ స్థాయి బూత్ క్యాప్చర్ కనిపించలేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దంగల్ అసెంబ్లీ ఎన్నికలను మించి జరిగింది.. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. అధికార విపక్షాలు నువ్వా నేనా అన్నట్లు తీసుకున్నాయి.. క్యాడర్ కూడా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు.. దీంతో బై పోల్ కాస్తా సాధారణ ఎన్నికలను మించిన హీట్ పెంచాయి.

     అయితే 14న ఫలితాలు ఎలా ఉన్నా కూడా పోలింగ్ ముగిసిన వెంటనే ప్రజలే కాదు రాజకీయ పార్టీలు, బెట్టింగ్ మాఫియా ఇంట్రెస్ట్ మొత్తం ఎగ్జిట్ పోల్స్ పైనే ఉన్నాయి..ప్రీ పోల్ సర్వేలు ఎలా ఉన్నా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు కాస్త దగ్గరగా ఉంటాయన్న అభిప్రాయంతో ఎగ్జిట్ పోల్స్ పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది..తెర వెనుక బెట్టింగ్ మాఫియా హస్తం ఉన్న కూడా పార్టీలు, ప్రజలు కూడా ఎగ్జిట్ పోల్స్ పై ఆసక్తి చూపుతారు.

   ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రతిసారీ ఎగ్జాట్ పోల్స్ కావు..ఒకటి రెండు సార్లు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్న ఎక్కువ సార్లు విఫలం అయ్యాయి..ప్రజానాడిని పట్టుకోవడం ఎవ్వరి వల్లకాదు..అంచనాలు వేయడం తప్ప నూటికి నూరు శాతం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం ఏ సర్వే సంస్థకు కూడా సాధ్యం కాదు. బై పోల్ లో వోట్ షేర్ బదలాయింపు జరిగినట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి..గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ లకు వచ్చిన వోట్ , ఇప్పుడు అనేక సర్వే సంస్థలు ఇచ్చిన ప్రర్సెంటేజ్ గమనిస్తే బీజేపీ వోట్   షేర్ పూర్తిగా సగానికి సగం తగ్గినట్టు కనిపిస్తుంది.. అదే సమయంలో బీఆర్ఎస్ వోట్   షేర్ గత రెండు ఎన్నికల్లో వచ్చిన వోట్ షేర్ యధావిధిగా ఉన్నట్లు కనిపిస్తుంది..కాంగ్రెస్ వోట్ షేర్ కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ఉంది.

     ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తేడా 5 శాతం గా ఇచ్చాయి.. అదే సమయంలో బీజేపీ వోట్ షేర్ 14 శాతం నుంచి 6 నుంచి 8 శాతం తగ్గినట్లు ఇచ్చాయి.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ  వోట్ షేర్ సగానికి పైగా ఏటు పోయింది అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్..ఏక పక్షంగా కాంగ్రెస్ కు పడిందా..బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్య చీలిపోయిందా అన్నది గెలుపోటములను డిసైడ్ చేస్తుంది..

    మరో విషయం ఏమిటంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన రెండు దఫాలుగా ఉన్న వోట్ షేర్ ను నిలుపుకున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి. అటు కాంగ్రెస్ కూడా తన సాంప్రదాయ వోట్ షేర్ నిలుపుకుంది..అయితే తగ్గిన బీజేపీ వోట్ షేర్ ఎటు పడింది..అదే విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 47 శాతం పోలింగ్ నమోదైతే ఇప్పుడు అది దాదాపు 49కి శాతం పెరిగినట్లు తెలుస్తుంది అయితే పెరిగిన  పర్సెంట్ శాతం వోట్లు ఎవరివైపు పడ్డాయి అన్నదాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి.

     అయితే జూబ్లీహిల్స్ బై పోల్ లో ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీ వోట్ షేర్ ఏకపక్షంగా కాంగ్రెస్ కు వెళ్ళే అవకాశం లేదు..అలా అని బీఆర్ఎస్ కు పడే ఛాన్స్ లేదు..ఆ 8 శాతం వోట్ షేర్ ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య చీలిపోతుంది.. అధికార విపక్షాల మధ్య ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది కూడా 5 శాతం తేడా ఇచ్చింది.. కాబట్టి బీజేపీ కోల్పోయిన వోట్ షేర్ ఏ పార్టీ ఎక్కువ సాధిస్తే ఆ పార్టీకే జూబ్లీహిల్స్ లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. అంతే కాదు పెరిగిన ఆ రెండు శాతం వోట్లు కూడా ఎటువైపు పడ్డాయో ఆ వోట్ షేరే గెలుపు కింగ్ మేకర్ అవుతుంది.. చివరిగా ప్రీ  పోల్ అయిన, ఎగ్జిట్ పోల్స్ అయిన వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండేది ఒక్క శాతం మాత్రమే.. అంతే కాదు ఎన్నికల అంచనాలు పెంచడం, బెట్టింగ్ మాఫియా ఆడే కోల్డ్ బ్లడెడ్ వైట్ కాలర్ గేమ్ మాత్రమే..ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ ఫలితాలు కావు.

-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page