తెలంగాణ ఆశలు, నిరాశలు: రాజకీయాల పునరాలోచన

2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పైన నిర్బంధం కొనసాగిస్తున్నప్పుడు పాడుకున్న పాట… పాలన  ఏం పాలన ఫాసిస్టు పాలన..కాంగిరేసు పాలన కసాయి మూకల పాలన…”  పాట ఇప్పుడు 2025లో మళ్ళీ అదే కాంగ్రెస్ సర్కారులో పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందిఅప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల్లో తేడా ఏమీదనేది స్పష్టంగా కనబడుతున్నదిభారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికరంలోకి వచ్చిన తరువాత దేశంలో ఫాసిస్టు పోకడలుమతోన్మాదంనిర్బంధం తీవ్రతరం అయ్యాయి.

ప్రజా సంఘాలుహక్కుల సంఘాలు పని చేసే పరిస్థితులు లేక కారు మబ్బులు కమ్ముకుని చీకట్లు ముసురుకుంటున్న సమయంలో బీజేపీని ఎదురుకోవడానికి మధ్యంతర మార్గంగా కాంగ్రెస్ పార్టీకి అనేకమంది ప్రజాసంఘాలుహక్కుల సంఘాల నాయకులురచయితలుకళాకారులుజర్నలిస్టులుబుద్ధిజీవులు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దత్తు తెలిపి అధికారంలోకి రావడానికి కారణం అయ్యారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలుమానిఫెస్టోలో పెట్టని 7 ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారంటీ, 420 హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయిసహజంగానే మనిషి ఆశాజీవి. కెసిఆర్ ప్రభుత్వంలో కన్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు మరింత ఎక్కువ లబ్ది జరుగుతుందనే ఆశతో ప్రజలు కాంగ్రెసును గెలిపించారు.

 

అలా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆశయాలను ఆకాంక్షలను ఎంతమేరకు నెరవేర్చిందితెరాస పాలనను విమర్శించిన బుద్దిజీవులుకాంగ్రెసు సర్కారు కోసం వోట్లేసిన ప్రజలు ఎంతమేరకు ఈ పాలనను సమర్థిస్తున్నారనేది చర్చించాల్సిన విషయం. కొత్త ప్రభుత్వం ఏర్పడి 17 నెలల కాలం గడిచిపోయింది. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలయ్యాయాకనీసం మొదలు పెట్టారాప్రజలు అంతకు ముందు ప్రభుత్వం కన్నా ఎక్కువ లబ్ది పొందుతున్నారాప్రభుత్వ భూముల అమ్మకాలు ఆగిపోయాయాకొత్త అప్పులు చేయడం లేదాఅవినీతి ఆగిపోయిందామేధావులు కోరుకున్న గుర్తింపు-గౌరవంప్రజాస్వామ్యంపౌర హక్కులు పునరుద్దరించబడ్డాయాఇప్పుడు చూద్దాం. ప్రజలు (కాంగ్రెస్ కార్యకర్తలతో సహా) 7-8 నెలల క్రితం వరకు ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఇప్పుడు అది తీవ్ర వ్యతిరేకతగా మారి “ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కొనితెచ్చుకున్నామా” అనే ఆలోచనలోకి తీసుకెళ్లింది. ఇందుకు కారణం హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం అవడమే. మహిళలకు ఉచిత బస్సు పక్కన బెడితే (దాని పట్ల కూడా మహిళల్లోపురుషుల్లో వ్యతిరేకతే నెలకొంది) మిగతా గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా 100% అమలు చేసాం అని చెప్పుకునే దైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. 

” ప్రజల్లో ఓపిక నశించకముందేతిరుగుబాటు మొదలుపెట్టకముందే వీలయినంత త్వరగా ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నాలను మొదలు పెట్టాలి. అన్నిటికన్నా ముందుగా ఎగ్గొట్టిన రైతు భరోసాతో పాటు ఈ జనవరిలో ఇవ్వవలసి ఉన్న రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. తీసుకున్న రుణానికి సంబంధం లేకుండా లక్షన్నర రూపాయల వరకు షరతులు లేకుండా అందరికీ మాఫీ చేయాలి. ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి వెంటనే ఇండ్లు మంజూరు చేయడమో లేక ఇంటి నిర్మాణ ఖర్చులు విడుదల చేయడమో చేయాలి. గ్యాస్ సబ్సిడీ డబ్బులు బ్యాంకు కాతాలో కాకుండా వినియోగదారుల వద్ద సిలిండరుకు 500 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి.  ప్రభుత్వ  నిర్లక్ష్యంతో,  కాలం  కాక  పంటలు  ఎండిపోయిన  రైతులకు  ఎకరాకు  25,000  రూపాయల  ఎక్స్ గ్రేషియా  చెల్లించాలియుద్ధప్రాతిపదికన ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు హామీ పడిన ఇతర పథకాల గురించి తెలంగాణ సమాజంతో సాధ్యాసాధ్యాలు చర్చించాలి..”

గ్యారంటీల అమలుకు బడ్జెట్లో కూడా అరకొర నిధులే కేటాయించారుమహిళలకు నెలకు 2500 రూపాయాల గ్యారంటీ ఊసే లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు కట్టించింది లేదు. కేంద్ర ప్రభుత్వం  విషయంలో తెలంగాణకు మొండి చేయి చూపే ప్రయత్నం చేస్తుందిరాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే పనికి రాదనికేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్లికేషన్లో తిరిగి సర్వే నిర్వహిస్తే కానీ ఇండ్లు మంజూరు చేయమని కొర్రీ పెట్టిందిరాష్ట్రవ్యాప్తంగా మళ్ళీ సర్వే చేయడం పెద్ద సవాలు కాగాకేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా పేదలకు “ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం అసాధ్యమయిన విషయంకాగా,   తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు దక్కలేదనికాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపునిచ్చి 250 గజాల ఇంటి స్థలం  ఇస్తానని హామీ ఇచ్చిందిప్రొఫెసర్ కోదండరాంకు ఉద్యమకారులను గుర్తించే బాధ్యత కూడా ఇచ్చిందిఇప్పటివరకు దాని చప్పుడే లేదువిద్యార్థులకు ఉన్నత చదువులకు లక్షల సహకారం అందిస్తా అని ఒక్కరికి ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రతి మండలానికి ప్రపంచ స్థాయి పాఠశాలాలను నిర్మిస్తాం అన్నారు.

ఇప్పుడేమో కేవలం 28 స్కూళ్లకు మాత్రమే ఫౌండేషన్ స్టోన్ వేయగా ఎక్కడా పనులు మొదలు కాలేదు. నాలుగు వేల రూపాయలకు పెంచుతామన్న  పింఛన్ల సంగతేమో కానీ “ఇచ్చే రెండు వేల రూపాయలు ఎగ్గొట్టకుండా ఇస్తే దండం పెడుతాం” అంటున్నారు పింఛ నుదారులు. బడ్జెట్లో కూడా ఇందుకు సంబందించిన నిధులు కేటాయించలేదురైతు భరోసా అయితే గత వర్షాకాలం ఇవ్వాల్సిన భరోసానే ఎగ్గొట్టగా మొన్న జనవరిలో ఇవ్వాల్సిన భరోసా ఇంకా ఎకరాలకు దాటకుండానే మళ్ళీ వర్షాకాలం రానే వచ్చిందిగ్యాస్ సిలిండర్ కు 500 సబ్సిడీ ఇస్తున్నాం అని చెప్తున్నప్పటికీ వినియోగదారుల వద్దయితే వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. సబ్సిడీ పైసలు బ్యాంకు అకౌంటులో పడుతున్నాయో లేవో దేవుడెరుగు.

రుణమాఫీ పూర్తి చేసాము అని చెప్పినప్పటికీ వాస్తవానికి లక్షన నర వరకే  చేయగా  వారిలో కూడా  అనేకమంది రైతులకు ఇప్పటికీ మాఫీ కాలేదని తెలుస్తుందిలక్షన్నర నుండి రెండు లక్షల ఋణం ఉన్నవారికి అస్సలే కాలేదురెండు లక్షలకు పైన ఋణం ఉన్న రైతులు అనేక మంది రెండు లక్షల పైన ఉన్న డబ్బును బయట ఎక్కువ మిత్తీలకు తెచ్చి బ్యాంకులో కట్టి రుణమాఫీ కాకపోయేసరికి లబోదిబోమంటున్నారు. చావు కబురు చల్లగా చెప్పినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లక్షల  కన్నా ఎక్కువ ఋణం ఉన్నవారికి ఋణమాఫీ చేయకూడదన్నది తన ప్రభుత్వ నిర్ణయం అని 2 లక్షల వరకు  ఉన్న  రైతు లందరి  రుణాలు మాఫీ చేశామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడమే అవుతుంది.

 

గత బీఆర్ ఎస్  ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందనిభూములు అమ్ముతుందని విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు అప్పులు ఏమీ చేయడం లేదా అంటే అదీ లేదు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువే ఆస్తులుభూములు తనకా పెట్టి అప్పులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంమొన్నటికి మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం ద్వారా విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలనుకున్నదిప్రొఫెసర్ హరగోపాల్ లాంటి మేధావులే  నిర్ణయాన్ని తప్పు పట్టినప్పటికీ ప్రభుత్వంలో చలనం  లేదుప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 1,60,000 కోట్ల రూపాయల అప్పు చేసి రికార్డు సృష్టించిందిమరి ఆ డబ్బంతా ఎటు పోతుంది అనేది సాధారణ ప్రజల ప్రశ్న. బీఆర్ఎస్  ప్రభుత్వంలో లేనటువంటి ప్రజాస్వామ్యంహక్కులు పునరుద్దరించబడ్డాయా అంటే అదీ లేదు. ప్రశ్నించే ప్రజలపైన కేసులు సర్వసాధారణం కాగాజర్నలిస్టులపై కూడా కేసులు పెట్టి జైలుకు పంపించడం కొసమెరుపు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి రాష్టంలో నెలకొంది. అధికారం గడిచి కేవలం 17 నెలలే అయింది… పెను సవాళ్ళన్నీ కాంగ్రెస్ పార్టీకి ముందే ఉన్నాయి. కార్యకర్తలుప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరకముందే ఎంపీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆ సీట్లు వచ్చాయి కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకు జరుపుకుంటూ వస్తున్నారు. ఇంకా ముందుకు జరపలేని సమయానికి వచ్చేసారు. అతి త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారనున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ 20శాతం  సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. అలా అని ఎన్నికలను పోస్టుపోన్ చేయడానికి అవకాశం లేదు ఒకవేళ ఉన్నా హామీలు అమలు చేయడానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించే స్థితిలో లేదు. ఈ ఎన్నికలు అయిపోగానే వీటి ఫలితాల మీద అనేక అంశాలు ఆధారపడి ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరవచ్చు లేదా ఒకవేళ ఈ స్థానాలకు ఉపఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ ఒక్క స్థానంలో కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవచ్చు.

ప్రజల్లో ఓపిక నశించకముందేతిరుగుబాటు మొదలుపెట్టకముందే వీలయినంత త్వరగా ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నాలను మొదలు పెట్టాలి. అన్నిటికన్నా ముందుగా ఎగ్గొట్టిన రైతు భరోసాతో పాటు ఈ జనవరిలో ఇవ్వవలసి ఉన్న రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. తీసుకున్న రుణానికి సంబంధం లేకుండా లక్షన్నర రూపాయల వరకు షరతులు లేకుండా అందరికీ మాఫీ చేయాలి. ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి వెంటనే ఇండ్లు మంజూరు చేయడమో లేక ఇంటి నిర్మాణ ఖర్చులు విడుదల చేయడమో చేయాలి. గ్యాస్ సబ్సిడీ డబ్బులు బ్యాంకు కాతాలో కాకుండా వినియోగదారుల వద్ద సిలిండరుకు 500 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతోకాలం కాక పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల ఎక్  గ్రేషియా చెల్లించాలియుద్ధప్రాతిపదికన ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు హామీ పడిన ఇతర పథకాల గురించి తెలంగాణ సమాజంతో సాధ్యాసాధ్యాలు చర్చించాలి.  దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చరిత్రలో మిగిలిపోవాల్సిందే.

ఇప్ప పృథ్వి రెడ్డి

సాఫ్ట్ వేర్ ఉద్యోగి,తెలంగాణ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *