తెలంగాణ రీజినల్ కమిటీ అచ్యుత రెడ్డి వర్సెస్ కొండా వెంకట్ రంగారెడ్డి

 ” భారతదేశంలో చాలా వెనకపడిన ప్రాంతాలలో తెలంగాణ ఒకటి అన్నది నిర్వివాదాంశం. కేంద్ర పాలిత ప్రాంతాలయిన అండమాన్స్, మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ తో పోల్చతగింది దీని అభివృద్ధి. శతాబ్దాల తరబడి నిరంకుశ రాజరికం ఉక్కుపాదాల క్రిందపడి నలిగిన జనతలో ఏమి ఆశించుతాము? అన్నివిధాల వెనక పడినతనాన్ని తప్ప. తెలంగాణ రాజకీయం చైతన్యాన్ని ఎందుకు కలిగివున్నది మరి  అభివద్ధి కుంటుపడినప్పుడు అన్న ప్రశ్న ఉదయించవచ్చు. స్థానిక ప్రజానీకంలో కలిగిన రాజకీయ చైతన్య దాస్యశృంఖాలను బద్దలు కొట్టటానికి పెల్లుబికి వచ్చిందే కాని అక్షరాస్యతవల్ల జనించలేదు. ఆర్థిక సంపన్నతవల్ల ఉత్పన్నంకాలేదు.”  

1961 తెలంగాణ ఉద్యమం ఒక విశ్లేషణ

43 జనధర్మో విజయతే 

తీవ్ర వాద ప్రతివాదాలకు దారితీసిన సమస్య తెలంగాణ అభివృద్ధి అనే శీర్షికతో జనధర్మ ప్రచురించింది.  ఈ మధ్య ఏ నోటంట విన్నా తెలంగాణ అన్న పదం చర్చకు వస్తోంది. పత్రికల్లో కొందరు ఈ విషయంపై చేసిన ప్రకటనలు ప్రచురింపబడితే, ‘వాటికి’ జవాబుగా ఇంకా కొందరు భాగ్యనగర్ కాంగ్రెస్ అయిన తరువాత ప్రకటించగలరని ఆ పత్రికేలే ప్రచురించారు. (ఆర్థిక సమస్యల వల్ల మిత్రులైన పాఠకులు జనధర్మ సహాయ నిధి ద్వారా కొంత డబ్బు సేకరించేవారని మొదటి పేజీలో వేసిన సంగతి చూడండి. మొత్తం 48 రూపాయల విరాళాలు వసూళ్లు ఇచ్చారు) ఇది ఒక విషయం: నాలుగ స్తంభాలాటవలె ఒకరినొకరు ఖండిచుకొనటం వల్ల సిద్ధించే ప్రయోజనాలేమిటి?

తెలంగాణ రీజినల్ కమీటీ అధ్యక్షుడు అచ్యుత రెడ్డి చేసిన ప్రకటనకు సమర్థనీయంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండా వెంకట రంగారెడ్డి గారు చేసిన వ్యాఖ్య ఆగ్నికి ఆజ్యంవలె కల్లోలం రేపటంలోతోడైనదని కొందరికి అన్పించిందట. ఇది ఆ ‘కొందరికి’ గల ‘దృష్టిదోషాన్ని ’ ప్రస్ఫుటంగ వెల్లిడి చేసింది కాని మరేమి కాదు. ఇంతకూ ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు ఏమి ప్రకటించారు? దానిని సమర్థిస్తూ రంగారెడ్డిగారు ఏమి నుడివినారు? గత నాలుగేళ్లనుండి తెలంగాణ పద్దుకు ఖర్చుపెట్టవలసిన 21 కోట్ల రూపాయల ఖర్చు పెట్టలేదని ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవటమే కాక కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం కినుక కూడ ప్రదర్శిస్తొందని ఆ ప్రకటనల సారాంశం.

వాస్తవికంగా జరిగిన విషయం ఇంతేనా? కాదు. వేరే వుంది. ప్రతి విషయాన్ని పూర్తిగా వ్యవహరించాలి కాని, ఏవగింపుతో నెట్టి వేయడంవల్ల ఆ విషయం మరుగున పడదు. నివురుగప్పిన నిప్పు వలె ఎప్పుడో ఒకప్పుడు ప్రజ్వరిల్లకమానదు. ఆంధ్రప్రదేశం ఏర్పడి అయిదు సంవత్సరాలు కావస్తొంది. ముక్కోటి ఆంధ్రుల సమైక్యం కావటం వల్ల సాధించలేనిది అంటూ ఏమీ వుండదని తలపోశారు అందరూ, ముఖ్యంగా తెలంగాణ వాసులు, యుగయుగాలుగ తరతరాలుగ మారకుండ వెనకపడినతనాన్ని అంటి పెట్టుకున్న తమప్రాంతం, అందరూ ఐక్యం కావటం వల్ల. ఆ స్థితిని త్వరితగతిని రూపుమాపవచ్చునంటి తలపోశారు తెలంగాణ వాసులు.

అవన్నీ పగటికలలే అయ్యాయి.

ఆంధ్ర సోదరులు విశాలాంధ్ర రాష్ట్రం అవతరించాలని పరితపించటంలోని అంతర్యం, అన్నివసతలు అమరియున్నరాజధాని నగరం కోసమేకాని, ఆ రాజధాని అనే ఒయాసిస్సు నావరించుకొన్న ఎడారినాంటి ప్రదేశం కొరకు కాదని తెలుసుకోటానికి ఎంతో కాలం పట్ట లేదు. అనుకొన్న ఆశలు నెరవేరినాట ఇక ‘‘ఆసక్తి’’ అంతరించిపోవటంలో ఆశ్చర్యమేమున్నది?పరిస్థితులు ఈవిధంగా మారగలవని గుర్తించే (ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర అవతరణానికి ముందు, కొందరు విజ్ఞులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు ఆందోళన లేవతీశారు. తలపెట్టిన ముహూర్తానికి పెళ్లెత్తిపోతుందేమోనన్న ఖంగారులో ఆతురతతో ఏవో పెద్దమనుషి ఒప్పందాల్లాంటివి చేసుకున్నారు. అవన్నీ కాగితాల్లో తప్ప వాస్తికంగా ఆచరించని నిదర్శనాలు వేళ్లపై లెక్కపెట్టవచ్చు.

భారతదేశంలో చాలా వెనకపడిన ప్రాంతాలలో తెలంగాణ ఒకటి అన్నది నిర్వివాదాంశం. కేంద్ర పాలిత ప్రాంతాలయిన అండమాన్స్, మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ తో పోల్చతగింది దీని అభివృద్ధి. శతాబ్దాల తరబడి నిరంకుశ రాజరికం ఉక్కుపాదాల క్రిందపడి నలిగిన జనతలో ఏమి ఆశించుతాము? అన్నివిధాల వెనక పడినతనాన్ని తప్ప. తెలంగాణ రాజకీయం చైతన్యాన్ని ఎందుకు కలిగివున్నది మరి  అభివద్ధి కుంటుపడినప్పుడు అన్న ప్రశ్న ఉదయించవచ్చు. స్థానిక ప్రజానీకంలో కలిగిన రాజకీయ చైతన్య దాస్యశృంఖాలను బద్దలు కొట్టటానికి పెల్లుబికి వచ్చిందే కాని అక్షరాస్యతవల్ల జనించలేదు. ఆర్థిక సంపన్నతవల్ల ఉత్పన్నంకాలేదు.

కాని 1956 సంవత్సరంలో దీనితో జత చేయబడ్డ ఆంధ్రప్రాంతం స్థితి వేరు. తెలంగాణ విషయానికి భిన్నమైనది. ప్రజలు విద్యావంతులు, ఆర్థికంగా మెరుగ్గా కాని 1956 సంవత్సరంలో దీనితో జతచేయబడ్డ ఆంధ్రప్రాంతం స్థితి వేరు. తెలంగాణ విషయానికి భిన్నమైనది. ప్రజలు విద్యావంతులు, ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వారు, ఇంకా సారవంతమయిన భూమి, సస్యశ్యామలమైన ప్రదేశం, ఎటుచూచినా కన్నులపండువగా (పెళ్ళి పందిరిలా ఉంటుదంటారు “ఆంధ్రదేశం” నేను చూడలేదనుకొండి. అదివేరే విషయం. ఒకతూరి లాంగ్ టూర్ వేసుకొని విజయవాడ చేరేసరికి మామయ్యకి సీరియస్ గా ఉందని టెలిగ్రాం వెనకే తయారు అంతే అన్నీ మానుకుని తిరుగు ప్రయాణం).

తెలంగాణాకు ప్రాణప్రదమైన, జీవగడ్డ ఐన పోచంపాడు ప్రాజెక్టు అంచనా లు ఇతర వివరాలు అన్నీ గతంలోకి వెళ్ళి పోయిన హైదరాబాదు ప్రభుత్వం తయారు చేయించినవే. భారీ ప్రాజెక్టుగా, ఆరు జిల్లాలలో 20 లక్షల ఎకరాలభూమి – సాగుచేట్లుగా 1,30,000 కిలో వాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేసేట్టు, ఆప్రాజెక్టు తల పెట్టబడింది. భారీ ప్రాజెక్టును మధ్య రకం ప్రాజెక్టుగా కుదించటమే అన్యాయం. ఆ మధ్యరకం ప్రాజెక్టుకు కూడ మూడవ ప్రణాళికలో చోటు లేదనే  ప్లానింగ్  కమిషన్  వితండవాదం మరీ  అన్యాయం. ఆకలితో అలమటిస్తున్న పేద తెలంగాణవాసుల గొంతు కోయటమే అవుతుంది, పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణాన్ని వాయిదా వేసే సంస్థల దృక్పధం. రెల్లుడుబ్బు తంగేడు చెట్లతో నిండిన రైలు కట్టల కిరువైపులఉన్న బీడుభూమిని చూచి ప్రధాని నెహ్రు ఆశ్చర్యపోయారట! నిరుపయోగంగ భూమిపడి ఉండటంచూచి, ఒకానొకసారి తెలంగాణంలో పర్యటిస్తున్నప్పుడు బీడుపడ్డ భూమి అంతా సాగులోకి వస్తే ఇక “కరువు” “కొరత” అన్న పదాలు ఎందుకు వినవస్తాయి? సాంస్కృతికంగా, విద్యావిషయకంగా అన్ని విధాల ఈ ప్రాంతం వెలుగులోకి రాక ఏమౌతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *