ఎస్సీ ఎస్టీ ల పై అత్యాచారాలకు నిలయంగా మారిన తెలంగాణ

 “గత టిఅర్ ఎస్ పాలనలో 2017 లో రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ళలో ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు దళిత వాడ పై దాడి చేసి 40 రోజులు లాకప్ హింసలకు పాల్పడి జైలు పాలు చేసారు. అధికారంలోకి వస్తే కేసులు ఎత్తి వేస్తామని పొలీసుల పై అట్రాసిటి కేసులు నమోదు చెస్తామని ,బాధితులను అదుకుంటమనే కాంగ్రెస్ హామీలు గత రెండున్నర సంవత్సరాలు గా అమలుకు నోచుకోక న్యాయం కోసం నేరెళ్ళ బాధితులు ఎదురు చూస్తున్నారు.టీఆర్ఎస్ పాలనలో దళిత మహిళ మరియమ్మను లాకప్ హత్య చేయగా,గిరిజన మహిళ లక్ష్మిని చిత్రహింసలకు గురి చేశారు. ఇక కాంగ్రెస్ పాలనలో షాద్‌నగర్ లో దళిత మహిళ సునీతను ఆమె భర్త,కొడుకు ను పోలీస్ స్టేషన్ లో ధర్డ్ డిగ్రీ చేయగా పౌర సమాజం నుండి ఒత్తిడి పేరగడంతో ముగ్గురు పొలీసులను సస్పెండ్ చేశారు. కోదాడలో  దళిత యువకుడు కర్ల రాజేష్, నర్సంపేట్ లో మహిళ పెండ్యాల సుచరిత జ్యుడిషియల్ మరణం పొందారు.ఇలా అనేక సంఘటనలు కొనసాగుతున్నాయి.”
తెలంగాణ రాష్ట్రం లో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వివక్షతను పాటిస్తుంది.చట్టం అమలుపై ప్రభుత్వం సమీక్షలు నిర్వహించకపొవడంతో చట్టాన్ని అమలులో పోలీస్,రెవెన్యూ అధికారులు అడుగడుగున చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ లపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. 2014 నుండి 2024 వరకు గత 11 సంవత్సరాలుగా రాష్ట్రంలో 23,873 ఎస్సీఎస్టీ అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. కేవలం 12408 మందికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. ఇంకా సగం మంది బాధితులకు నష్ఢపరిహరం చెల్లించకుండా ప్రభుత్వం చట్డాన్ని ఉల్లంఘిస్తుంది.ఇక పునరావాసం నామా మాత్రమే.

అత్యాచారాలను ఆరికట్టాల్సిన పోలీస్ రెవెన్యూ అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్వవహరిస్తుండటంతో దాడులు రోజు రోజు కు పెరుగుతున్నాయి. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు అట్రాసిటి కేసులు నమోదు చేయకుండా చట్టానికి విరుద్దంగా రాజీ చేసుకొవాలని బాధితుల పై ఒత్తిడి తెస్తు నిందితుల పక్షనా నిలుస్తున్నారుకేసు నమోదు కు కూడ బాధితులు ఆందోళన చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి.కేసుల నమోదు కు సైతం ఎస్సీ ఎస్టీ కమిషన్ లు జోక్యం చేసుకుంటున్నయంటే పొలీసుల నిర్లక్ష్యం చెప్పకనే చెబుతుంది.

    కుల వివక్ష కొత్త రూపాలలో పంజా విసురుతు బహిరంగాంగనే బరితెగించి అధిపత్య కులాలు వివక్షను పాటిస్తున్నాయి.తాజా ఉదరహణగా చైతన్యవంతమైన కరీంనగర్ లో నే ఎస్సీ లకు ఇల్లు కిరాయికి ఇవ్వమని బోర్డు తగిలించడం చూస్తున్నాం.
కులాంతర ప్రేమ వివాహలను చేసుకుంటున్న జంటలను కులదురహంకార హత్యలకు పాల్పడుతుండటం అందోళన కనిపిస్తుంది. భూముల అన్యాక్రాంతం,ఉద్యొగులవపట్ల వివక్ష విద్వేషం పెరుగుతుంది,ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ ల భూములను అన్యాక్రాంతం చెస్తున్నాయి.భూముల అన్యాక్రాంతాన్ని ప్రశ్నిస్తున్న దళిత గిరిజనుల పై పోలీసులు దాడులకు పాల్పడుతు అక్రమ కేసులు నమోదు చెస్తు అరెస్టు లు చెస్తున్నారు. ఎస్సీ ఎస్టీ లకు అండగా వుండాల్సిన పొలీసులే లాకప్ చిత్ర హింసలకు,లాకప్ డెత్ లకు పాల్పడుతున్నారు.నేరెళ్ళ, అడ్డగూడుర్ ,షాద్‌నగర్, కోదాడ, ఎల్బినగర్,తుకారాం గేట్ పొలీసులు లాకప్ హింసలకు పాల్పడుతున్నారు.
   గత టిఅర్ ఎస్ పాలనలో 2017 లో రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ళలో ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు దళిత వాడ పై దాడి చేసి 40 రోజులు లాకప్ హింసలకు పాల్పడి జైలు పాలు చేసారు. అధికారంలోకి వస్తే కేసులు ఎత్తి వేస్తామని పొలీసుల పై అట్రాసిటి కేసులు నమోదు చెస్తామని ,బాధితులను అదుకుంటమనే కాంగ్రెస్ హామీలు గత రెండున్నర సంవత్సరాలు గా అమలుకు నోచుకోక న్యాయం కోసం నేరెళ్ళ బాధితులు ఎదురు చూస్తున్నారు.టీఆర్ఎస్ పాలనలో దళిత మహిళ మరియమ్మను లాకప్ హత్య చేయగా,గిరిజన మహిళ లక్ష్మిని చిత్రహింసలకు గురి చేశారు. ఇక కాంగ్రెస్ పాలనలో షాద్‌నగర్ లో దళిత మహిళ సునీతను ఆమె భర్త,కొడుకు ను పోలీస్ స్టేషన్ లో ధర్డ్ డిగ్రీ చేయగా పౌర సమాజం నుండి ఒత్తిడి పేరగడంతో ముగ్గురు పొలీసులను సస్పెండ్ చేశారు. కోదాడలో  దళిత యువకుడు కర్ల రాజేష్, నర్సంపేట్ లో మహిళ పెండ్యాల సుచరిత జ్యుడిషియల్ మరణం పొందారు.ఇలా అనేక సంఘటనలు కొనసాగుతున్నాయి.
కానరాని హైలెవల్ కమిటీ
రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ల పై అత్యాచారాలను ఆరికడుతు నివారణ చర్యలు తీసుకొని సమీక్షించేందుకు చట్టం ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన హైలెవల్ కమిటి ని ఏర్పాటు చేయాలి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమిటి ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ సమీక్షించకుండా చట్టానికి విరుద్దంగా దళిత అభివృద్ధి శాఖ మంత్రికి బాధ్యలను అప్పగించి చేతులు ఎత్తెశారు. మంత్రి అధ్యక్షతన ఒకె ఒక సమావేశం జరిగింది. రాష్ట్ర స్దాయిలో దళిత,గిరిజన సంఘాలతో ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర స్ధాయి మానిటరింగ్ కమిటిని ఏర్పాటు చేయలేదు.
మొక్కుబడిగా జిల్లా మానిటరింగ్ కమిటిలు
చట్టం ప్రకారం ప్రతి మూడు నెలలకొకసారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన,జిల్లా ఎస్పీ, పొలీస్ కమిషనర్ సమక్షంలో జరగాల్సిన జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి సమావేశాలు జరగడం లేదు. ఉదహరణకు సిద్దిపేట జిల్లాలో గత సంవత్సరం జూన్ లో డివియంసి సమావేశం జరిగింది అంటే గత ఏడు నెలలగా సమావేశమే నిర్వహించలేదు.దళిత ప్రజా సంఘాల నాయకులకు కమిటి లలో స్ధానం నామమాత్రంగా నియమిస్తూ అధికార పార్టీ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం గా మార్చారు. మెజారిటీ జిల్లాలలో డివియంసి కమిటిలను ఏర్పాటు చేయలేదు. జిల్లా స్దాయిలో అత్యాచారాలను నిరోధించడంలో వైఫల్యం కొనసాగుతుంది.
పడని శిక్షలు
ఎస్సీ ఎస్టీ ల పై దాడులు అత్యాచారాలు చేస్తున్న నిందితులకు శిక్షలు నామమాత్రంగానే పడుతున్నాయి.2020లో 2535. కేసులు నమోదు కాగా 1909 కేసులలో మాత్రమే పొలీసులు ఛార్జ్ షీట్   వేయగా 804 కేసులను పొలీసులు ఫాల్స్ కేసులుగా తేల్చగా  కోర్టులలో 434 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.కేవలం 16 కేసులలో మాత్రమే శిక్షలు పడ్డాయి. మొత్తం తెలంగాణ  కోర్టు లలో 45282 కేసులు పెండింగ్ లో ఉన్నాయంటే విచారణ ఎంత జాప్యంగా కొనసాగుతుందో అర్ధం చెసుకొవచ్చు. కోర్టులలో విచారణ లు ఆలస్యం వల్ల రాజీ చేసుకొవాలని బాధితుల పై,సాక్షుల పై ఒత్తిడి పెరుగుతుంది. పిపి ల పొలీసుల నిర్లక్ష్యం వల్ల శిక్షలు సున్నా గానే ఉంటున్నాయి.
ప్రభుత్వం తక్షణం చెపట్టాల్సిన చర్యలు.
ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి.
ముఖ్యమంత్రి అధ్యక్షతన హైపవర్ కమిటి వేసి ఆరు నెలలకొకసారి సమీక్షించి అత్యాచారాలను నిరోధించాలి.
జిల్లా డివియంసి కమిటిలు ఏర్పాటు చేయాలి. ప్రతి మూడు నెలలకొకసారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించి అత్యాచారాల నిరోధించాలి.
బాధితులకు సకాలంలో నష్టపరిహారం చెల్లించాలి.పునరావాసం కింద ఉద్యోగం, పెన్షన్,భూమి,ఇళ్ళు మంజూరు చేయాలి.
ప్రతి నెల చివరన పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలి.
ప్రతి జిల్లా లో ప్రత్యేక ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కోర్టుల ను ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి పడుతూ ఈనెల 25 న హైదరాబాద్  పౌర సంస్ధలు బహిరంగ ప్రజా విచారణను నిర్వహస్తుంది.
పి.శంకర్
దళిత బహుజన ఫ్రంట్ (డి బిఎఫ్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *