పెరిగిన ప్రభుత్వ వ‌స‌తిగృహ విద్యార్థుల‌ డైట్, కాస్మోటిక్ చార్జీలు 

రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌స‌తిగృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థ‌ల సొసైటీ (TREIS) ప‌రిధిలోని వ‌స‌తిగృహాల్లో డైట్ ఛార్జీలను పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. డైట్ చార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ   విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగాల సెక్రటరీలు శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
పది రోజుల్లో కొత్త డైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశిస్తూ విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్ లో మార్పులు, చేర్పులు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పెంచిన డైట్, కాస్మోటిక్ ఛార్జీలతో 7,65,705 మంది విద్యార్థుల‌కు  ప్ర‌యోజ‌నం కలుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *