హృదయ భాష కవిత్వం…
దండిగా మానవత్వపు మూలాలున్న కవిత్వం అనేక సంచారాల్లో కూడా విలక్షణ అన్వేషణల వీక్షణమవుతుంది. ఆరంభమైన నడకని గమ్యానికి చేర్చే దిక్సూచి లాంటిది కవిత్వపు బాధ్యత. కవి కవిత్వం రాయటానికి సమాయాత్తం కావటమంటే అగ్ని పూసిన అక్షరాలను, కాగి మాగిన అనుభవాలను దోసిట్లో పట్టుకోవడమే. శిథిలాలను, భయోద్విగ్నాలను కూడా పదిలంగా కవిత్వంలోకి ఒంపే ధీరతను కవి పుణికి…
