‘కాప్’ సదస్సుల లక్ష్యం నెరవేరేనా..?

ప్రపంచ వాతావరణ సదస్సు కాప్-29 అజర్ బైజాన్‌లోని బాకులో జరిగింది. నవంబర్ 11-22 మధ్య జరగాల్సిన ఈ సదస్సును అంతర్గత విభేదాలు, వాగ్వివాదాల వల్ల రెండు రోజులు పొడిగించారు. అయినా వాతావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కోవాలన్న లక్ష్యం నీరుగారిపోయిందని వర్ధమాన దేశాలు నిరసిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ అనేది, ఇంకేమాత్రమూ శీతల దేశాల శాస్త్రీయ చర్చలకో, ఎవరో…
