వసుధైక నమూనా
కష్టసుఖాల కావడి బరువు సమానంగా పంచుకుంటూ, ఆలనాపాలనలకు ఆప్యాయతల దండవేస్తూ, ఐకమత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఉమ్మడి కుటుంబాలు బంధాల విలువను,బలాన్ని మరోతరానికిజి ఆత్మీయంగా బోధించే పాఠశాలలు, సంస్కృతీ సంప్రదాయాల శిక్షణాశిబిరాలు. అవి హృదయాలకొక ప్రశాంతవాటిక వసుధైక కుటుంబానికి ప్రాతిపదిక మమతానురాగాల లోగిళ్ళలో అంతా ఒక గూటి పక్షులై, అరమరికల్లేని అరకలతో కుటుంబాల్ని సాగుచేసుకుంటూ, సహపంక్తి…