అడ్డూ అదుపులేని ధరలపై ఏదీ నియంత్రణ!
గత దశాబ్ద కాలంగా కోట్లాదిమందిని పేదరికం నుంచి విముక్తం చేసామని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతున్నారు. దేశం ఆర్థిక అభివృద్దిలో దూసుకుని పోతోందని అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వీటిని పట్టించుకోవడం లేదు. అంతెందుకు అంత్యోదయ అన్నయోజన కింద సరఫరా చేసే ఉచిత బియ్యం పథకాన్ని వచ్చే డిసెంబర్ వరకు పొడిగించారు.…