తలెత్తుకోలేని సందేశం
ఎదనిండా నమ్మకాన్ని నింపుకుని నిబ్బరంగా నిర్భయంగా దేశానికి సేవచేసే సైనికుడైనాడు శత్రువులెపుడు దండెత్తిన బెదరక అడుగేసిన వీరుడతడు అహర్నిశలు దేశమే శ్వాసగా అంకితమై జన్మభూమికి రక్షకుడైన భరతమాత ముద్దుబిడ్డడు నా దేశం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తే మనసెపుడు మరువలేని అవమానభారాన్నిచ్చింది నాదేశమిపుడు కులమతాల కుతంత్రాలతో రగులుతున్న రణస్థలం సంపన్నవర్గాలకు కాపలా సమన్యాయమిక్కడ సమాదైంది వెనుకబాటు కులాలకిక్కడ రక్షణలేని…