ఏడాది పర్వాలకు ఆది పండుగ ఉగాది

ఏడాది పండుగ, ఉగాది పండుగ అనే దేశ్య నామాలతో వ్యవహరింపబడే సంవత్సరాది పర్వము, ఏటా రానున్న ఎన్నతగిన ఏభై పైచిలుకు పండుగలలో మొదటిది. తెలుగువారు తమ సంవ త్సరాదిని చాంద్రమాన గణనాధారంగా చైత్ర శుక్ల ప్రతిపదతో ప్రారంభించడం సనాతన ఆచారం. చైత్ర శుక్ల పాడ్యమి సంవత్సరాది అని బ్రహ్మపురాణం కంరోక్తిగా చెపుతున్నది. అలాగే ఈదినం నుండి…