ఈ శతాబ్ది శతకం
కొన్ని ప్రవహించే మొహాలను చూశాను దేశాలను దాటుతూ నిరంతరాయంగా అవి కోరస్ ఆలపిస్తూ విషాద నాటకానికి తయారవుతున్నవి వాటి మాస్కులను ఏ యుద్ధబీజాలకో తగిలించి వ్యసనానికి సహనాన్ని నేర్పే పాత్రలకై విశ్వ గురుత్వ స్థిరాంకాలను ఏర్పరుస్తూ విఫలమైనవే.. అవి ఏడుస్తున్నప్పుడు కన్నీళ్ళు జిగురు రంగు రక్తపు చారలుగా మరకల మడతలుగా హోర్డింగ్ చేయబడ్డవి ఇది ప్రకటన!…