జ్ఞాపకాల జోలె

సంక్రాంతి పిలిచిందనీ ఊరెళ్ళాను. మిత్రులు రమ్మాన్నారని వీధులన్నీ తిరిగాను. మనిషి మనిషిలో పోలిక పోగులను విప్పుకుంటూ ఊరును మోస్తూ మనసు అర్ధరాత్రి ఇంటికి చేరింది. జ్ఞాపకాల జోలెను రాశిగా పోసి మట్టి కొట్టుకున్న తేదీలను సంవత్సరాలలో ముంచి తేల్చి మాట గుర్తులతో పలకరింపు హోదాలో దగ్గరై ప్రతి ఒక్కరు ఇష్టంగా ముందుకు నడుస్తుంటే తల నెరిసిన…







