లిటర(రీ)సీ-బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు సభ మొదలయ్యింది. సభికులు ప్రజలు కాదు, పాఠకులు. ఆ పాఠకులు కూడా వొకప్పటి రచయితలే. రచయితల సభలో రచయితలు కాక యెవరు యెందుకు వుంటారని గడుసుగా సమాధానం యివ్వగలరు కూడా నిర్వాహకులు. ఆమాటకొస్తే నిర్వాహకులు కూడా రచయితలే. అంచేత అందరూ రచయితలే అని చెప్పుకుంటే గొప్పగా గర్వంగా వుంటుంది. సాహిత్యోద్యమాలు జరిగిన నేలమీద సాహిత్య…
