Tag telangana political updates

దీపావ‌ళి ప్ర‌జ‌ల జీవితాల్లో న‌వ్య‌ కాంతులు వెల‌గాలి..

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి  దీపావళి శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30:  ఈ దీపావ‌ళి పండుగ  ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతులు, స‌మృద్ధిని అందించాల‌ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిష‌న్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పర్వదినం సందర్భంగా హిందువుల‌కు శుభాకాంక్షలు తెలిపారు. రావణుడిని సంహరించిన తర్వాత విజయోత్సాహంతో రాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా జరుపుకొనే…

”నంద‌నవ‌నం” ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు

అర్హుల‌కు న్యాయం చేయాలి గృహ‌నిర్మాణానికి సంబంధించిన‌ ఫిర్యాదులకు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం.. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : రంగారెడ్డి జిల్లా ఎల్‌బి న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని నంద‌న వ‌నంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మించిన ఇండ్ల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించుకున్న‌వారిని త‌క్ష‌ణమే ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల…

కుల‌గ‌ణ‌న ప‌రిశోధ‌న కేంద్రంగా తెలంగాణ‌

దేశానికి మోడల్ గా నిల‌వ‌బోతున్నాం.. ప్ర‌జ‌లంద‌రికీ సామాజిక న్యాయ‌మే ల‌క్ష్యం ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ గాంధీభ‌వ‌న్ లో కాంగ్రెస్ ముఖ్య నేత‌ల‌తో భేటీ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, అక్టోబ‌ర్ 30 : కుల గణన విష‌యంలో పరిశోధన కేంద్రంగా తెలంగాణ దేశానికి మోడల్ గా నిల‌వ‌బోతున్నామ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు తెలిపారు. కుల…

మ‌యోనైజ్ తో ప్రాణాల‌కు ముప్పు

త‌క్ష‌ణ‌మే నిషేధిస్తూ ఉత్త‌ర్వులు జారీ వెల్ల‌డించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాష్ట్ర వ్యాప్తంగా త‌నిఖీల‌కు ఆదేశం హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 30:  ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్‌ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధ‌వారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉడకబెట్టని కోడిగుడ్లతో తయారు చేస్తున్న మయోనైజ్‌ను ఏడాది పాటు నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో…

దేశ అభ్యున్న‌తికి ఇందిరాగాంధీ ఎన‌లేని కృషి

Indira Gandhi countless efforts

దివంగ‌త ప్ర‌ధానికి సీఎం రేవంత్ నివాళి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 :  ప్ర‌తి ర‌క్త‌పు బొట్టు దేశ ప‌టిష్ట‌త‌కు తోడ్ప‌డుతుంద‌ని ప్ర‌క‌టించిన మ‌హ‌నీయురాలు మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరా గాంధీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్ర‌ధాని ఇందిరా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆమె సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి స్మ‌రించుకున్నారు. త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి…

రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి

Happy Diwali from KCR to people

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30:  రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని…

ప్రతీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత పదేండ్ల విధ్వంసపు పాలనలోని చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రజా పాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి…

అబద్దాల్లో గోబెల్స్ ను మించిపోయారు..

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : పిల్లలు ఎక్కడ చెడిపోతారోనన్న భయంతో.. తల్లిదండ్రులు టీవీలు బంద్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి గెబెల్స్ కూడా సిగ్గు పడ‌తారు. ఆయ‌న మాటలపై ప్రజలకు నమ్మకం పోతోంది. ముఖ్య‌మంత్రి మాటలు విన్న పిల్లలు.. వాటినే పరీక్షల్లో రాస్తే పరిస్థితి ఏంటి? హైద‌రాబాద్ కు మూడు దిక్కులా సముద్రం…

ఉపాధ్యాయుల‌కు చారిత్రక బాధ్యతలు

ఉపాధ్యాయ సంఘాల సూచనలు అమ‌లు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స‌చివాల‌యంలో 13 ఉపాధ్యాయ సంఘాలతో  స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 :  చారిత్రాత్మక కుల గణన సర్వేలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఆయన మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొన్నం…