తెలంగాణ విముక్తికి సాహిత్య, సాం స్కృ తిక సంస్థల పాత్ర
తెలుగుభాషా సంస్కృతులకు వికాసానికి తెలంగాణా ఆంధ్రోద్యమం చేసిన కృషి చారిత్రకమైనది. శ్లాఘనీయమైనది. ‘రెండు నూర్ల పాతిక సంవత్సరాల ఆసఫ్జాహీ పరిపాలనా ఫలితంగా హైదరాబాదు రాష్ట్రంలో ఆంధ్రుడు తౌరక్యాంధ్రుడైనాడు’ (దేవులపల్లి రామానుజరావు, తెలంగాణాలో జాతీయోద్యమాలు). తెలుగు ప్రజలు మాతృభాషలో కాకుండా అరబ్బీ, పారసీ, ఉర్దూ భాషలలో చదువు నేర్చుకోవలసిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణా భాష, సంస్కృతి మరుగునపడుతున్న…