గువాహటిలో ఐఐటీ తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి

హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి3: తెలంగాణకు చెందిన ఐఐటీ గువాహటి విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతురాలు అస్సాంలోని ఐఐటీ గువాహటి లో ఇంజినీరింగ్ ఈసీఈ నాలుగో ఏడాది చదువుతున్న పుల్లూరి ఐశ్వర్యగా గుర్తించారు. ఈ విషయాన్ని ఐఐటీ గువాహటి ధృవీకరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఐశ్వర్యతో పాటు తన ముగ్గురు స్నేహితులు…