‘‘యుద్ధం’’ నిషేధం
అధికార దాహమో… సామ్రాజ్య మోహమో.. ప్రేరేపించేది ఏధైతేనేమి! యుద్ధం పెను విధ్వంసమే మతోన్మాదమో.. గుత్తాధిపత్యమో కారణాలు ఏవైతేనేమి! యుద్ధం జాతి వినాశనమే దురాక్రమణో తిరుగుబాటో దండయాత్రో ఆయుధ దాడో అది ఏ రీతిగా సంభవించినా యుద్ధం మిగిల్చేది విషాదమే అవాంఛిత యుద్ధంలో గెలుపోటమి ఎవరిదైనా మసకబారేది మానవత్వం మంటగలిసేది మనిషితనం రణాన్ని రమించడమంటే మృత్యువును హత్తుకోవడం…