విశిష్ట వ్యాస లహరి…
తెలంగాణలో పేరెన్నికగన్న సాహిత్య సంస్థ శ్రీలేఖ సాహితి. వరంగల్లు కేంద్రంగా మహత్తర సాహిత్య సేవలందిస్తున్న ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్న సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ టి శ్రీరంగస్వామి ఆ సంస్థ పక్షాన ఎన్నో కవితా సంపుటులు, పరిశోధనా గ్రంథాలు, కథా సంపుటులు, వ్యాససంకలనాలను వెలువరించారు. ఆ కోవలోనే వెలువడిన వ్యాస సంపుటి వెలుగుల గుత్తి. పరిశోధనాత్మకంగా…