రాజ్యాంగ స్పూర్తి తో విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చట్టం అమలుకు నోచుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి విద్యా శాఖ మంత్రి బాధ్యతను తానే నిర్వహిస్తూ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని పలు మార్లు పలు సమావేశాలలో మాట్లాడడం ఒక మంచి పరిణామం. అంతే కాకుండా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేయడం…