సూక్తి పరిమళం..

వసివాడని జ్ఞాన పరిమళమే పద్యం. అప్రతిహతమైన సృజన రూపంగా, హృదయ రంజకమైన అసిధారా ప్రవాహంగా పద్యం సదా పరిఢవిల్లుతూనే ఉంది. తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు పరంపరలుగా వస్తున్నా తన ప్రాభవాన్ని పదిలం చేసుకుంటూ పద్యం జనరంజకమై దూసుకుపోతూనే ఉంది. సంస్కృత కవి భారవి, తెలుగు కవులలో తిక్కన తక్కువ పదాలలో ఎక్కువ అర్థాన్ని చెప్పే…