ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ బాధ్యతలు

అభినందించిన మంత్రులు జూపల్లి, పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన మహమ్మద్ అలీ షబ్బీర్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని కార్యాలయంలో ప్రార్థనల అనంతరం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా పదవీ బాధ్యతలు…