సకల శుభాల ఉగాది!!
వేపచెట్టుకి ముత్యాలు పూసి తళ తళా మెరుస్తుంటే మామిడి చెట్టుపై గుండ్రటి నక్షత్రాలు నోరూరిస్తుంటే సూరీడి కళ్ళల్లో కూసింత వేసంగి తాపం సురుక్కుమంటే పాట విని వెళ్ళమని దారిలో చెట్టు చెట్టుకి ఎగిరొచ్చి కోయిల పిలుస్తోంటే శిశిరపు పత్రాల్లో హరితం ఆవిరై మట్టిలో కలిపితే వాసంతం చిగుర్లేసి హరితం ఆయువై కళకళలాడిస్తే చైత్ర శుద్ధ పాడ్యమి..ఉగాదై…
