Tag Rs.60000 Crores for land

దేవాదాయ భూముల పరిరక్షణ కు పకడ్బంది చర్యలు..

బ్రహ్మోత్సవాల నాటికి యాదగిరి గుట్ట దేవాలయ గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం భద్రాచలం దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ లో భాగంగా భూ సేకరణ కు రు.60 కోట్లు : మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ భూముల పరిరక్షణలో భాగంగా స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్రంలోని పలు ఆలయాల అభివృద్ధి వివరాలు, భక్తులకు కల్పిస్తున్న వసతుల వివరాలు, దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు చేపడుతున్న చర్యల వివరాలు తెలుపుతూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖకు చెందిన భూములను పరిరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని వివరించారు. దేవాదాయ భూములను సర్వే చేసి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు 34 వేల 92 ఎకరాల దేవాదాయ భూములకు జియో ట్యాగింగ్ చేయడం జరిగిందని అన్నారు. 57 శాతం దేవాదాయ భూములను ధరణిలో నిక్షిప్తం చేయడంతో పాటు ఇతరలు ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు లేకుండా చర్యలు తీసుకున్నమన్నారు. ఆలయాల అభివృద్ధి... రాష్ట్రంలోని ప్రముఖ ఆలాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి యాదగిరి గుట్ట దేవాలయ గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం చేస్తున్నామన్నారు. దాతల చే సేకరించిన 15 కోట్ల విరాలాలతో ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీనివలన రోజుకు సూమారు 2500 మంది భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని అందించే వీలు కలుగుతుందని అన్నారు. అదే విధంగా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలినడక భక్తులకు ఎండ నుండి ఉపశమనం కల్పించేందుకు షెడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ లో భాగంగా భూ సేకరణ చేసెందుకు 60 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వీటితో పాటు వేములవాడ, భాసర వంటి ప్రముఖ ఆలయాల అభివద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో అన్ని దేవాలయాల వెబ్ సైట్ లను ఒకే గొడుగుకిందకు తీసుకు వచ్చి దేవాదాయ శాఖ సమగ్ర వెబ్ సైట్ ను తయారు చేయబోతున్నామన్నారు. త్వరలో దేవాదాయ శాఖ యాప్ ను ఏర్పాటు చేయడంతో పాటు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా భక్తులు తమకు ఇష్టం వచ్చిన దేవాలయాల వివరాలు స్థల పురాణాలు తెలుసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం... గత 15 సంవత్సరాలుగా బదిలీలు లేకుండా ఒకే చోట పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఉపశమనం కల్పిస్తూ భారీగా భదిలీలు చేపట్టమన్నారు. దేవాదాయ శాఖలోనే ఇది రికార్డు అన్నారు. ప్రెసిడెన్,యల్ ఆర్డర్ 2018 వచ్చిన తర్వాత జోనల్ సిస్టమ్ ప్రకారం సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరించుకున్నామని అన్నారు. చాలా రోజులగా దేవాదాయ శాఖలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామని తెలిపారు.

 బ్రహ్మోత్సవాల నాటికి యాదగిరి గుట్ట దేవాలయ గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం భద్రాచలం దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ లో భాగంగా భూ సేకరణ కు రు.60 కోట్లు : మంత్రి కొండా సురేఖ  దేవాదాయ శాఖ భూముల పరిరక్షణలో భాగంగా స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా…

You cannot copy content of this page