శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
ఎగువనుంచి కొనసాగుతున్న ప్రవాహం కర్నూలు,జూలై18: శ్రీశైలం ప్రాజెక్టుకు అంతకంతకూ వరద తాకిడి పెరుగుతోంది. ఎగువన ఉన్న జూరాల, తుంగభద్ర డ్యాంల నుంచి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడంతో ఆలమట్టి, తుంగభద్ర జలాశయాలకు ఇన్‌లో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉండడం.. ఇంకా వరద వచ్చే అవకాశం ఉండడంతో…
