Tag Regional Ring Road also in Gajwel

గజ్వేల్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో కూడా రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు

‌న్యూ దిల్లీ, అక్టోబర్‌ 16: ‌రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు గజ్వేల్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో కూడా నలభై కిలోమీటర్ల రేడియస్‌ ‌లో నిర్మాణం చేపట్టాలని, బాధితులకు నష్టపరిహారం పెంచాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ ‌గడ్కారీని కోరినట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. బుధవారం న్యూ దిల్లీ లోతెలంగాణ భవన్‌ ‌లో మీడియా సమావేశం లో మాట్లడుతూ తెలంగాణకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లు ఎక్కువ కేటాయించాలని..స్వచ్ఛ భారత్‌ ‌నిధులు పెంచాలని..చెరువులు బాగు చేయడానికి నిధులు ఇవ్వాలని..స్ట్రాటజిక్‌ ‌నాలా డెవలప్మెంట్‌ ‌ప్రోగ్రాం కి నిధులు ఇవ్వాలని కొరినట్లు తెలిపారు.మన ప్రజలు ఇచ్చిన రిప్రజెంటేషన్లను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు కానీ ఒక్క మంత్రి కూడా మాట్లాడటం లేదు ముఖం చాటేస్తున్నారు. ఏదన్నా అంటే ముఖ్యమంత్రిని కలవమంటున్నారు. అది అందరికీ సాధ్యమా ? అని ప్రశ్నించారు. ఇప్పుడున్న ఓఆర్‌ఆర్‌ ‌కి 40 కిలోమీటర్ల దూరంలో రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్తున్నారు. కానీ గజ్వేల్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో కేవలం 28 కిలోమీటర్ల లోపే రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డును ఫామ్‌ ‌చేస్తున్నారు. అక్కడ రైతాంగం ఇప్పటికే ప్రాజెక్టుల కోసం, కాలువల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం భూములు కోల్పోయాము, చివరికి అక్కడ వేస్తున్న కరెంటు లైన్ల కోసం కూడా భూములు ఇచ్చి ఉన్న భూమితో బ్రతుకుతున్నాము మమ్ముల్ని బికారీలను చేయవద్దు అని ఉద్యమం చేస్తున్నారు. కోటి రూపాయలు ఉన్న భూమికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం మాత్రమే ఇచ్చారు. మళ్లీ రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు పేరుతో తమను రోడ్డు మీద పదవేయవొద్దని మా దగ్గరికి వొచ్చి రిప్రజెంటేషన్‌ ఇస్తే..నితిన్‌ ‌గడ్గరీని కలిసి వారి బాధను తెలియజేశాను. సంపూర్ణ నివేదిక అందిస్తాము. గడ్గరి మీటింగ్‌ ఏర్పాటు చేసి దీనికి పరిష్కారం చూపిస్తామని తెలియజేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ ‌లాల్‌ని కలిశాము.గతంలో కేంద్రం 2 లక్షల 40 వేల ఇళ్లు ఇస్తే కెసిఆర్‌ ‌ప్రభుత్వం వాటిని కట్టలేకపోయింది. కట్టిన వాటిని కూడా పంచ లేకపోయారు. పంచినవి కూడా స్థానికులకు కాకుండా వేరేవాళ్లకు ఇచ్చారనే అపవాదు ఉంది. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ళు ఈ దఫా ఎక్కువ సంఖ్యలో రాష్ట్రానికి కేటాయించాలని, అది కూడా నిజమైన పేదవారికి దక్కేలా విధివిధానాలు ఉండాలని మంత్రిని కోరాము. తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారని ఈటల పేర్కొన్నారు.

స్వచ్ఛ భారత్‌ ‌నిధులు పెంచాలి కేంద్ర మంత్రులను కోరిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌న్యూ దిల్లీ, అక్టోబర్‌ 16: ‌రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు గజ్వేల్‌, ‌భువనగిరి, చౌటుప్పల్‌ ‌ప్రాంతంలో కూడా నలభై కిలోమీటర్ల రేడియస్‌ ‌లో నిర్మాణం చేపట్టాలని, బాధితులకు  నష్టపరిహారం పెంచాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ ‌గడ్కారీని కోరినట్లు మల్కాజిగిరి…

You cannot copy content of this page