ఒక ప్లేట్ ఇడ్లీ- మూడు సాసర్ల సాంబార్
హనుమకొండ చౌరస్తా నుండి పబ్లిక్ గార్దెన్ వైపు వస్తుంటే ముందుగా మీకు కుడి వైపు గీతా భవన్ హోటల్ వస్తుంది. ఆది దాటగానే (ఇప్పటి జీవన్ లాల్ కాంప్లెక్సు కు ఎదురుగా) ఒక కాంపౌండ్ గోడకు మధ్యలో అమర్చిన ఒక ఫాటక్, దాని లోంచి లోపలకు పోతే ముందుగా కొద్దిగా ఓపెన్ స్పేస్ వుండి ఎదురుగా…