Tag #PrajatantraLiterature

అద్దె కల

మీ ఊరిలోనే నా నిజమొకటి అద్దె కలతో కాపురముంటుంది నేను వచ్చినప్పుడు అక్కడే దిగుతాను సమయాన్ని ఖర్చు పెట్టి కొనుక్కునే ఓ తృప్తి అక్కడే దొరుకుతుంది వెళ్ళేటప్పుడు ఉన్న కుర్రతనం వచ్చేటప్పుడు దొంగలు పడినట్టుగా పోగొట్టుకుని వస్తాను మళ్ళీ మళ్లీ పొందాలని వెళుతుంటాను కానీ ఆ కల కాపురం అక్కడే మనసు మాత్రం ఎక్కడో -శ్రీ…

తెలవారదేమో స్వామి

  నేను చచ్చిపోయాను ఎలా చచ్చిపోయానో తెలుసా? అరే… మాట్లాడుతుంటే మధ్యలో నా చీర విప్పేస్తున్నారు, చిరిగిన రవిక తీసేస్తున్నారు, అదేంటి నా శవాన్ని కాల్చేటప్పుడు కదా, నా వొంటిమీద వున్న బట్టలన్నీ తీసేయ్యాలి, అరే యిదేమిటి యిప్పుడే తీసేస్తున్నారు? కాటికి వెళ్ళకముందే నన్ను బోడిమొలతో గాని నిలబెడతారా? ఒక్కోకట్టెతో నా మానం కప్పుతూ కదరా…