విలేకరి మృతికి మంత్రి పొంగులేటి సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: సిరిసిల్ల టీవీ9 విలేకరి ప్రసాద్ ఆకాల మరణం పట్ల రెవెన్యూ, హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూు భదవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
