Tag political analysis

జీవన పోరాటం..

“ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం పార్టీ ఫిరాయింపులు. సుదీర్ఘ కాలం పాటు జగిత్యాలలో జీవన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం జీవన్ రెడ్డికి అశనిపాతంలా మారింది. దశాబ్ద కాలంగా ఎవరితోనైతే పోరాడారో, ఎవరి విధానాలను ఎండగట్టారో, అదే వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.…

నిబద్ధత లేని తటస్థ వైఖరి!!

“క్రూరమైన అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన చమురు అవసరాల కోసం నైతికత అనే దిక్సూచిని ఉపయోగిస్తోంది. ఇరాన్ పాఠశాలలపై క్షిపణుల దాడులను ఖండించకుండా మౌనం పాటిస్తూ, తన చమురు ట్యాంకర్లు సురక్షితంగా స్వదేశానికి పంపాలని ఇరాన్‌ను అడుక్కుంటోంది. అంటే ఇక్కడ రక్తం కంటే చమురుకే అధిక ప్రాధాన్యం! ఇరాన్ కూడా మన దేశంపై ప్రేమతో చేయడం…

కమలనాథుల కక్షసాధింపు రాజకీయాలకు చెంపపెట్టు.!

bjp politics in telangana

న్యాయస్థానంలో పేలిన ‘లిక్కర్’ అబద్ధం! భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలి. కానీ, గత దశాబ్ద కాలంగా కేంద్రంలోని బిజెపి అగ్రనేతలు ఈ సంస్థలను తమ రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించే వేట కుక్కల్లా, ప్రతిపక్షాలను వేధించే ఆయుధాల్లా మార్చేశారనే విమర్శలకు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఒక…

సామూహిక అనుభవానికి ప్రతినిధి

‘అంతే అతడు లేచాడు స్మశానానికి వచ్చినప్పుడు లేని మొండి ధైర్యమేదో మనసు నిండా నిండింది. నడుస్తూ వుంటే వీధి లైట్లు, వెలుగు నీడలు. అవును నీడ దాటితే వెలుగు. ఈ హైదరాబాద్ నాకు ఉద్యోగమిస్తుంది, ఈ హైదరాబాద్ నన్ను నిలబెడుతుంది, ఈ హైదరాబాద్ నాకు జీవితాన్నిస్తుంది’ అన్న విశ్వాసం, నమ్మకం రచయిత అక్కినేని కుటుంబరావుదో, ‘పట్టణంలో…

మూసీ బకాసురీకరణలో సామాన్యుల జీవనమెట్టిది!  

“అత్యవసరమైన డిపిఆర్ తయారు కాకుండానే, అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా ఆ ప్రాంతంలోని ప్రజలకు, నివాసులకు ఇచ్చిన నష్టపరిహారం తీసుకుని భూములు, ఇళ్లు వదిలేయాలని నోటీసులు పంపుతున్నారు. పనులకు టెండర్ ప్రకటనలు ఇస్తున్నారు. కొందరినైతే ఏడాదిన్నర కిందనే బుల్డోజర్లతో తొలగించారు. పథకానికి అవసరమైన నిధుల కోసం అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దగ్గరికి వెళుతున్నామని, ఏషియన్…

2025 – రాష్ట్రంలో బీజేపీ ‘హడావుడి’ కే పరిమితం ..!

తెలంగాణ రాజకీయాల్లో “భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభావం అనే ప్రశ్న గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం చర్చలో ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి దశలో పరిమిత ప్రభావానికే పరిమితమైన బీజేపీ, 2019 తర్వాత తన రాజకీయ ఉనికిని గణనీయంగా పెంచుకుంది. అయితే 2025 నాటికి బీజేపీ ప్రభావం “వృద్ధి–స్థిరత్వం–పరిమితి” అనే మూడు దశల…

రెండేళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ సాఫల్య వైఫల్యాలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయం 2023 ఎన్నికలతో మరో మలుపు తిరిగింది. దశాబ్దకాలం ఒక్క పార్టీ ఆధిపత్యాన్ని ముగిస్తూ, ‘ప్రజల పాలన–ప్రజలతోనే’ అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల వేళ వెలువరించిన ఆరు ముఖ్య హామీలు, రాష్ట్ర పరిపాలనపై “పూర్తి పారదర్శకత” వాగ్దానం, పాత…