Tag My agony

నా వేదన

అమాయకులను అడుగడుగునా అణగదొక్కుతూ వారి కుత్తుకలను కత్తిరిస్తోన్న, కబందహస్తాల ధృతరాష్ట్రుని కౌగిలిలో చిక్కిన సమాజమిది, కంపుకొడుతున్న వాస్తవమిది. వివక్ష చూపెడి మూర్ఖుల ముంగిట విచక్షణ నశించిన హీనులు, పరితపించి పరితపించి సాగిలబడుతోన్న ఈ సమాజంలో అవమానపు అమాసలు ఎడతెరిపి లేక పలకరిస్తూ నిశీధిపొద్దుల్లోకి ఆహ్వానిస్తోంటే, నా తనువుని నిలువెల్లా నిరాశ తీగలు అల్లుకుంటున్నాయి. అవమానాల చేదు…