Tag #Minister Sridharbabu #inaugurated #Children park

మహదేవ్‌పూర్‌లో చిల్డ్రన్స్‌ పార్కు ప్రారంభం

మహదేవ్‌పూర్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో చిల్డ్రన్స్‌ పార్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐత ప్రకాష్‌ రెడ్డి, కలెక్టర్‌ రాహుల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.