మతోన్మాద మరకలు
పరువు హత్యల ఉన్మాదాలు నడిరోడ్డుపై రక్తపు మడుగులు చోద్యం చూస్తున్న సకల జనులు సాక్షుల్నే దోషులంటున్న అస్రీన్‌లు మత-కులోన్మాద దారుణ దాష్టికాలు ! కుల-మతాంతర వివాహాల హత్యలు కులం కత్తి ఝలిపిస్తున్న విపరీతాలు మతాంతీరకణలు, కులన్యూనతలు నిమ్నవర్గ యువతకే యమపాశాలు కులమత నిర్మూలనలే పరిష్కారాలు ! మానవమృగాలు పేట్రేగుతున్న ఘోరాలు తోబుట్టువులే గొంతు కోస్తున్న అకాలాలు…
