చైతన్య కార్యక్రమాలతో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలి: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 20 : ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని, అత్యధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంది యాక్సిడెంట్లలోనేనని నివేదికలు చెబుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. సోమవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్లో రోడ్…