న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడాలి!
ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పేరుగాంచిన భారతీయ న్యాయవ్యవస్థకు ఏ ఇతర న్యాయవ్యవస్థ కూడా సాటిరాదు. కానీ ‘తులసివనంలో గంజాయి మొక్కల’ తీరుగా న్యాయవ్యవస్థకు మకిలి అంటించే న్యాయాధికారులు, న్యాయమూర్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిర్భయంగా తీర్పులు వెలువరించేలా న్యాయమూర్తులను, న్యాయాధికారులను రాజ్యాంగం అత్యంత ఉన్నత స్థానంలో నిలిపింది. విశేష అధికారాలను, విస్తృతమైన వ్యక్తిగత విచక్షణనూ…