సంసిద్ధత-లక్ష్మీ కందిమళ్ళ

దుర్మార్గం తన అడుగులను గర్జనలతో వినిపిస్తుంది. చేతుల్లోని అధికారాన్ని శాశ్వతమని భావిస్తుంది. తన నీడనే ప్రపంచమంతా కమ్మేస్తుందని అహంకరిస్తుంది. కానీ అది చూడలేని ఒక మహాశక్తి ఉంది. అదే ప్రకృతి. ప్రకృతి ఎప్పుడూ తొందరపడదు. ఎందుకంటే కాలం తన శ్వాస. ఋతువులు తన అడుగులు. సూర్యోదయం తన చిరునవ్వు. సంధ్య తన ధ్యానం. నక్షత్రాలు తన కళ్లలో…
