కాకతీయ ఉత్సవ సప్తాహం
మరోసారి కాకతీయ ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబవుతున్నది. నేటి నుండి ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాల యంత్రాంగమంతా సిద్దమయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ‘కాకతీయ ఉత్సవా లంటూ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నది ఈ సంవత్సరమే. సరిగ్గా పదేళ్ళ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి.…