Tag #Joinings #congress #Jadcharla Muncipal Chairman #CM

కాంగ్రెస్‌లోకి జడ్చర్ల చైర్మన్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో పలువురు జడ్చర్ల నాయకులు శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. జడ్చర్ల మునిసిపల్‌ చైర్మన్‌ కోనేటి పుష్పలత (బీఆర్‌ఎస్‌), కౌన్సిలర్లు చావా నాగరాజు లలిత (బీజేపీ), గుండా ఉమాదేవి (బీఆర్‌ ఎస్‌)లు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎంఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.