ఆవేశాగ్ని రగిల్చిన జలియన్‌వాలా బాగ్ నరమేధం..!
(13 ఏప్రిల్ ‘జలియన్‌వావా బాగ్ నరమేధ దుర్ఘటన దినం’ ) మొదటి ప్రపంచ యుద్ధం(1914-18) ముగిసిన వేళలవి. యుద్ధం మిగిల్చిన క్షతగాత్రులు, అధిక ద్రవ్యోల్బణ దుస్థితి అనుభవంలోకి వచ్చిన రోజులవి. అధిక పన్నులు, అంటువ్యాధులతో సామాన్య ప్రజాజీవనం తల్లడిల్లిన సమయమది. ఐక్యకూటమిగా జాతీయోద్యమం తిరిగి పుంజుకున్న సందర్భమది. దాదాపు 13 లక్షల భారతీయ జవాన్లు విదేశాల్లో…
