గల్ఫ్ జైళ్లలో వేలాది భారతీయులు
ఉన్న ఊరిలో ఉపాధి కరువై, పొట్టచేత పట్టుకుని ఎడారి దేశానికి వెళ్లి నాలుగు రూపాయలు సంపాదించ వచ్చుననే ఆలోచనలతో గల్ఫ్ బాట పట్టిన యువకులు అనూహ్యంగా అవాంఛిత అలవాట్లకు లోనై, జైలు పాలు అవుతున్నారు. కఠినమైన చట్టాలు ఉండే గల్ఫ్ దేశాలలో తెలంగాణ యువత తెలిసీ తెలియక, అవగాహన లేకుండా డ్రగ్స్ ఉచ్చులో పడి జీవిత…