ఆక్రమణదారులను, అధికారులను హడలెత్తిస్తున్న హైడ్రా
హైడ్రా… ఇప్పుడు ఈ పేరు రాజధాని నగరంలో సంచలనంగా మారింది. ఆ పేరు వినగానే అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. ఇంతకాలం డబ్బు, పలుకుబడి, కండబలంతో ఆక్రమణలు చేపట్టిన వారికిది సవాల్‌గా మారింది. చూస్తుండగానే బహుళ అంతస్తుల భవనాలు నేలకూలుతున్నాయి. ఆ శిధిలాలు చూస్తుంటే ఎంతో తీవ్రమైన భూకంపం వొచ్చినట్లు ఆ ప్రాంతాలు కనిపిస్తున్నాయి.…