మానవత్వం కోసం అన్వేషణ…

ఒక్కరోజుతోనే ముగిసిపోయే / ఊరి జాతరలా ఎన్నికల పండగ… రాజకీయ గొంగట్లో/ విశీర్ణమౌతున్న విలువల గొంతుకలు/ ఎంత గుక్కపట్టి ఏడ్చినా / రెక్కలు విదుల్చుకోలేక కునారిల్లుతున్నాయి అని వర్తమాన రాజకీయాల విచిత్రాలను ఓట్ల సంత కవితలో డా.ఎన్. ఈశ్వరరెడ్డి విశ్లేషించారు. నాకొక మనిషి కావాలి అన్న శీర్షికన 43 కవితలతో ఆయన కవితా సంపుటి వెలువడింది.…
