శ్రామిక మహోత్సవం

పెట్టుబడిదారి చేష్టల దిక్కరిస్తూ శ్రామిక లోకం పిడికిలెత్తిన దినం తరాల బానిసత్వాన్ని నిరసిస్తూ శ్రమ శక్తి కదంతొక్కిన సందర్భం శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కార్మిక వర్గం నినదించిన దినం నేడే ప్రపంచ కార్మిక దినోత్సవం చికాగో నగర హేమార్కెట్లో… అమర వీరుల ఆత్మ బలిదానం కోట్లాది కార్మిక నెత్తుటి తర్పణం కళ్లెదుట నిలిపే చారిత్రక దినం…
