నిరుద్యోగి మనోవేదన….
బతుకు దెరువు కోసం ఇల్లు, ఆకిలి వదిలికన్నపేగుకి బంధాలకు దూరంగా ఎవ్వరు ఎర్కలేని గా పట్నామ్లా బిక్కు బిక్కుమనుకుంటు సర్కారి కొలువు కొట్టాలని బియ్యం ముఠా భుజాన వేసుకొని బయలుదేరిన. సదువుకుంటే నౌకరు వస్తది నా బిడ్డా నాలెక్క గొడ్లను కాసుకుంటా దుక్కులు దున్నతు ఎవుసం సేస్తే ఎట్లా ఈ గొడ్డు కట్టం వానితో ఐతదా……
