ప్రభుత్వ నిర్ణయాలు ప్రజామోదంగానే ఉండాలి!
రాష్ట్రంలో మూసీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. మురికి కంపు కొట్టిస్తున్నాయి. చివరకు జుగుప్స కలిగిస్తున్నాయి. పరస్పర విమర్శలు, బజార్ భాష వాడడం గతంలో ఎప్పుడూ లేనంతగా వినిపిస్తోంది. రాజకీయనాయకులు దిగజారి పోయారు. ముఖ్యంగా కొండా సురేఖ వ్యాఖ్యలతో చిత్రపరిశ్రమ ఎన్నడూ లేనంతంగా ఆక్రందన చెందింది. అలాగే కెటిఆర్‌పై సురేఖ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు గమనిస్తే…