Tag giriyanam

వియత్నాం నుంచి తిరుగు ప్రయాణం

“ఇలాంటి గెరిల్లా యుద్ధ పద్ధతులు అక్కడ చాలా ఉన్నాయి. అందువల్లనే అమెరికా సైనికులు భారీగా మరణించారు. ఫలితంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం యుద్ధం విరమించినట్లు ప్రకటించింది. అప్పటినుంచి ఉండిపోయిన అమెరికన్లు, ఆ ప్రదేశంలో జరుగుతున్నంత సేపు వియత్నా మీస్ యుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్య పోయాను. పలు యుద్ధాలను ఎదుర్కొని 1975లో స్వతంత్రాన్ని పొందిన వియత్నాం అతి కొద్ది సమయంలోనే వాళ్ళు సాధించిన సాంకేతిక, సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఫిదా అయ్యాను. శ్రమపట్ల వాళ్ళకున్న గౌరవం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళను ఈనాడు ముందంజలో ఉంచింది. ప్రస్తుతం అమెరికా వియత్నాం మిత్రదేశాలు.” గిరియానం – 1 హోచిమన్ నగరం వియత్నాం దేశానికి రాజధాని. దక్షిణ వియత్నాంలో ఉంది. వాతావరణం వెచ్చగా ఉంటుంది. పూర్వం ఈ నగరాన్ని సైగాన్ అని పిలిచేవాళ్ళు. సైగాన్ నదీ తీరంలో ఉండడం వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. తరువాత కమ్యూనిష్టు నాయకుడు హోచిమన్ మీద గౌరవంతో ఆ పేరు స్థిరపడింది. ఈ నగర జనాభా 14 మిలియన్లు. ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం. హోచిమన్ అసలు పేరు న్గుయెన్ సీన్ కుంగ్. మే 19 తేదీన 1890 సంవత్సరంలో జన్మించాడు. సుమారు ఇరవై యేళ్ళ వయసులో దేశం విడిచిపెట్టి వెళ్ళి ‘ వియత్ మిన్ ‘ అనే సంస్థను స్థాపిం చాడు. ఫ్రాన్స్ , అమెరికా యుద్ధాలలో వియత్నాం విముక్తి కొరకు గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో పోరాటం చేసాడు. ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం అని రెండు భాగాలుగా ఉన్న వియత్నాంను ఏకం చేయాలని ఆయన ఆశయం. 1945 నుంచి 1969 దాకా ఉత్తర వియత్నాం అధ్యక్షుడుగా పనిచేసాడు. 1969లో మరణించాడు. ఆయన మరణించిన తర్వాతనే ఉత్తర దక్షిణ వియత్నాంలు 1975లో ఒకే దేశంగా రూపొందింది. ఈ విషయాలు గైడ్ చెర్రీ చెపుతున్నప్పుడు నాకు ప్రొ. జయశంకర్ గుర్తుకు వచ్చాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు కలగన్న ఆయన మరణించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తొమ్మిది మంది బృందంలో నేను, పద్మ, అనురాధ వియత్నాం వార్ మ్యూజియం చూడడానికి వెళ్ళాం. ఈ మ్యూజియం ను 1975 లో ప్రారంభించారు. ఇది అమెరికా వియత్నాం యుద్ధానికి సజీవ సాక్ష్యం. బయటి ప్రాంగణంలో ఆ యుద్ధంలో ఉపయోగించిన ట్యాంకర్లు, విమానాలు ఉన్నాయి. వార్ మ్యూజియం…

వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు లేని దేశం

“చైనాలో నన్ను ఆశ్చర్యపరచిన మరో విషయం.. అక్కడ ఎవరికీ వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు లేకపోవడం. అక్కడ ఎలక్ట్రిక్ సైకిళ్లు, బైక్స్ మాత్రమే ఉన్నాయి. అలాంటివి అక్కడక్కడా కూడళ్లలో పెట్టి ఉన్నాయి. అవసరమైన వాళ్ళు అక్కడే పోల్ కు ఏర్పాటు చేసిన స్కానర్ లో స్కాన్ చేసి తీసుకెళ్ళవచ్చు. తమ పని అయి పోయాక మరో స్టాండులో…

బీజింగ్ పర్యటన

  అక్కడి నుంచి నిషేధిత నగరానికి ( forbidden city)కి వెళ్ళాం. ఇది చైనాలోని అతి పెద్ద పురాతన భవనాలలో ఒకటి. ఇది చారిత్రక నిర్మాణం. మింగ్, క్వింగ్ రాజుల నివాసం. ఐదు వందల సంవత్సరాలకు పైగా 24 మంది మింగ్, క్వింగ్ చక్రవర్తులు అక్కడ నివసించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద. దీనిని ‘…

ప్రపంచంలోనే ఎత్తైన రెండు అంతస్తుల వంతెన

మలేషియాలో మరో అందమైన ప్రదేశం మలక్కా చారిత్రాత్మక నగరం. ఇది యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద.  పూర్వకాలంలో సముద్ర వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. నగరాన్ని చేర డానికి కొంత దూరం పడవలో వెళ్ళాలి. నదికి రెండు తీరాల్లో పెద్ద పెద్ద అందమైన భవనాలు మనలను చూపు తిప్పుకోనివ్వవు. అవన్ని పోర్చుగీస్, డచ్ భవనాలని తెలిసింది. అక్కడి చర్చ్, కట్టడాలు ఆనాటి చరిత్రను కళ్ళ ముందుంచాయి. గిరియానం – 6 చాలా యేళ్ళ విరామం తర్వాత yhai సెంట్రల్ యూనిట్ వాళ్ళు మలేషియా ట్రిప్ మళ్ళీ ప్రారంభిస్తున్నామని ప్రకటన చేసారు. ప్యాకేజీ ₹  25000/ మాత్రమే. విదేశీ ప్రయాణం 25 వేలకు చాలా చౌక అని Yhai హైదరాబాదు మహిళా యూనిట్ విహంగ నుంచి పదిమందికి పైగా బుక్ చేసుకున్నాం.  మలేషియా…