సింహాద్రి అప్పన్నకు సంప్రదాయ చందనోత్సవం… భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం
‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్ నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమా మ్యహమ్’’… ‘‘సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్’’… దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన సింహాచల క్షేత్రంలో స్వామి వారికి ఆషాఢ పౌర్ణమి నాడు చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ…